సూర్యాపేట జిల్లా:బహుజన రాజ్యాధికారం కోసం బీఎస్పీ రాష్ట్ర కో ఆర్డినేటర్ డా.ఆర్ఎస్.
ప్రవీణ్ కుమార్ చేపట్టిన 300 రోజుల సుదీర్ఘ యాత్రను బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రజలు విజయవంతం చేయాలని బీఎస్పీ సూర్యాపేట జిల్లా ఇంచార్జీ పిల్లుట్ల శ్రీనివాస్ పిలుపునిచ్చారు.సోమవారం మునగాల మండలం రేపాల గ్రామంలో జరుగుతున్న రేపాల శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు హాజరైన ఆయన ముందుగా గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం గుట్టపై గల రేపాల శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతరను సందర్శించి తిలకించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఎస్పీ అంటే దళితుల పార్టీ అనే ముద్ర వేసే కుట్ర జరుగితుందని,బహుజన సమాజ్ వాదీ పార్టీ సబ్బండ వర్గాలకు రాజ్యాధికారం కట్టబెట్టే పార్టీ అని తెలిపారు.
ఇంత కాలం అనేక రాజకీయ పార్టీల జెండాలు మోసింది కేవలం బాహుజనులైన ఎస్సి,ఎస్టీ బీసీ,మైనార్టీ,అగ్రకుల పేదలేనని గుర్తు చేశారు.జెండాలు మనం మోస్తే జేజేలు వాళ్ళు కొట్టించుకున్నారని,ధర్నాలు మనం చేస్తే దర్జాగా పెత్తనం వాళ్ళు చేశారని,ఓట్లు మనం వేస్తే సీట్లు వాళ్ళు ఎక్కారని,అదంతా గతమని,ఇకనుండి ఆ లెక్కలు కుదరదవని నినదిస్తూ బహుజనులు బయలుదేరారని,వారికి బీఎస్పీ ఆర్ఎస్పీ అండగా ఉండేందుకు మన దగ్గరకు వస్తున్నారని చెప్పారు.
ఇప్పటికైనా ఎస్సి,ఎస్టీ,బీసీ మైనార్టీ బిడ్డలు రాజ్యాధికార యుద్ధంలో పాల్గొని అగ్రవర్ణ పార్టీల పెత్తనానికి గండి కొట్టాలని సూచించారు.ఈ కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా నాయకులు దశరథ,మండల నాయకులు సోమపంగు కార్తీక్ గ్రామ యువకులు పాల్గొన్నారు.