సూర్యాపేట జిల్లా: సూర్యాపేట నియోజకవర్గ బీజేపీ అభ్యర్ధి సంకినేని వెంకటేశ్వరరావు తరుపున ఎన్నికల ప్రచారం చేయడానికి బీజేపీ మిత్రపక్షమైన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నేడు సూర్యాపేటకు రానున్నారు.
గురువారం ఉదయం 11 గంటలకు జిల్లా కేంద్రంలోని పిఎస్ఆర్ సెంటర్ లో నిర్వహించే సభలో పవన్ కళ్యాణ్ పాల్గొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతారు.
జనసేనాని రాక సందర్భంగా బీజేపీ, జనసేన భారీ జన సమీకరణకు ఏర్పాటు చేసింది.