ఉపాధి హామీ కూలీలకు వడదెబ్బపై అవగాహన

సూర్యాపేట జిల్లా: ఈ వేసవిలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున ప్రజలు ఉదయం 10 గంటలలోపు సాయంత్రం 4 గంటల తరువాత పనులకు వెళ్ళాలని హెల్త్ అసిస్టెంట్ కృష్ణమూర్తి అన్నారు.మంగళవారం సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం త్రిపురవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ఉపాధి హామీ పనులు చేస్తున్న త్రిపురవరం గ్రామ కూలీల దగ్గరకు వెళ్ళి వడదెబ్బ లక్షణాలు,తీసుకోవలసిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించారు.

 Awareness Of Sunburn For Employment Guaranteed Workers, Awareness Of Sunburn ,em-TeluguStop.com

అనంతరం ఆయన మాట్లాడుతూ ఎండలో పనిచేయడం వల్ల శరీరంలో చెమట ద్వారా డిహైడ్రేషన్ జరుగుతుందని,తద్వారా వడదెబ్బ తగిలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు.వడదెబ్బ లక్షణాలు చెమట పట్టక పోవడం,శరీర ఉషోగ్రత పెరగడం,వణకు పుట్టడం, మగతగా ఉండడం,పిట్స్ రావడం,పాక్షికంగా అపస్మారక స్థితిలోకి వెళ్ళడం జరుగుతుందని వివరించారు.

తరుచుగా మంచినీళ్ల త్రాగడం,మజ్జిగ, నిమ్మరసం,కొబ్బరి నీళ్లు, పల్ల రసాలు తీసుకోవాలని తెలిపారు.అత్యవసర పరిస్థితుల్లో బయటికీ వెళితే,కాళ్ళకు చెప్పులు ధరించడం,టోపి,గొడుగు,తేలిక పాటి తెల్లని కాటన్ దుస్తులు ధరించాలని సూచించారు.

రోడ్లపై దొరికే పానీయాలు తీసుకోకూడదన్నారు.ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు,ఆశా వర్కర్స్ ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube