గ్రామీణ తపాలా ఉద్యోగుల ధర్నా

సూర్యాపేట జిల్లా: గ్రామీణ తపాలా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఆల్ ఇండియా గ్రామీణ డాక్ సేవక్స్, నేషనల్ యూనియన్ ఆఫ్ గ్రామీణ డాక్ సేవక్స్ జేసీఏ ఆల్ ఇండియా పిలుపు మేరకు జిల్లా కేంద్రంలోని పోస్టల్ డివిజన్ కార్యాలయం ఎదుట గురువారం గ్రామీణ డాక్ సేవకులు ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా జిడిఎస్పీ జెసిఏ డివిజన్ కన్వీనర్ జి.

 Dharna Of Rural Postal Employees, Dharna ,rural Postal Employees, Grameena Dak S-TeluguStop.com

నాగరాజు, పిజెపిఏ చైర్మన్ రవి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పోస్టల్ శాఖలో విధులు నిర్వహిస్తున్న గ్రామీణ డాగ్ సేవకుల ద్వారా వెట్టిచాకిరి చేయించుకుంటుందని,ఈ వెట్టిచాకిరి నిర్మూలనను తొలగించి కమలేష్ చంద్ర కమిటీ సిఫారసులను అమలు చేస్తూ,ఎనిమిది గంటల పని కల్పిస్తూ పెన్షన్తో కూడిన అన్ని ప్రయోజనాలు మంజూరు చేయాలని,

సీనియర్ జిడిఎస్ లకు 12,24,36 సంవత్సరాల సర్వీస్కు అదనపు ఇంక్రిమెంట్లు మంజూరు చేసి ఆర్థిక ఉన్నత కల్పించాలని, గ్రూప్ ఇన్సూరెన్స్ ఐదు లక్షలకు పెంచాలని, గ్రాడ్యుటి 5 లక్షలకు పెంచాలని, పెయిడ్ లీవ్స్ 180 రోజులకు దాచుకొని నగదుగా మార్చుకుని సౌకర్యం కల్పించాలని, గ్రామీణ డాక్ సేవకులకు వారి కుటుంబానికి వైద్య సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.అనంతరం పోస్టల్ సూపర్డెంట్ వెంకటేశ్వర్లుకు డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి ఓ.లింగయ్య,ఏజిడిఎస్ యు డివిజన్ అధ్యక్షులు ఎం.కర్ణాకర్,డివిజన్ సభ్యులు చలిగంటి పుల్లయ్య,పి.దివ్య,మంగ్త,సందీప్,గోపి, మల్లారెడ్డి,రమేష్,సంతోష్,ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube