హుజూర్ నగర్ లో గులాబీ పార్టీకి మరో ముగ్గురు గుడ్ బై...!

సూర్యాపేట జిల్లా:ఎన్నికల నోటిఫికేషన్ కు ముందు నుండి హుజూర్ నగర్( Huzur Nagar ) నియోజకవర్గంలో అధికార పార్టీ నుండి ప్రారంభమైన వలసల జోరు ఇంకా కొనసాగుతోంది.తాజాగా ఆదివారం బీఆర్ఎస్ పార్టీకి మరోసారి బిగ్ షాక్ తగిలింది.

 Goodbye To Three More For Gulabi Party In Huzur Nagar , Huzur Nagar , Gulabi Par-TeluguStop.com

బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు జిన్నారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, నేరేడుచర్ల మునిస్పల్ 15 వ,వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ కుంకు సులోచన, మాజీ సింగిల్ విండో చైర్మన్ గుమ్మడపు వెంకటేశ్వరరావుతో పాటు మరికొందరు నాయకులు కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.వారికి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీలో సముచిత స్థానం లేనందునే పార్టీని వీడినట్లు తెలిపారు.హుజూర్ నగర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మద్దతుగా నిలిచి ఆయన గెలుపు కోసం కృషి చేస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో నేరేడుచర్ల మండల పార్టీ అధ్యక్షుడు కొణతం చిన్న వెంకటరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube