సూర్యాపేట జిల్లా:హుజూర్ నగర్ పట్టణంలో గృహజ్యోతి పథకానికి గ్రహణం పట్టిందా లేక ఇక్కడ లబ్ధిదారులు చేసుకున్న పాపమో తెలియదు కానీ,200 యూనిట్ల ఉచిత విద్యుత్ అమలు కాక అనేకమంది అవస్థలు పడుతున్నారు.ఉచితం లేకపోగా వందల్లో కరెంట్ బిల్లులు రావడంతో మేము గృహజ్యోతికి అర్హులం కాదా? మాకు జీరో బిల్లు ఇవ్వరా…? అని బాధితులు వాపోతున్నారు.గృహజ్యోతి ఎడిట్ ఆప్షన్ కు మాకు అవకాశం ఇవ్వండని కోరుతున్నారు.







