సూర్యాపేట జిల్లా: కోదాడ ఆర్డీవో కార్యాలయంలో కోదాడ ప్రభుత్వ వైద్యశాల 100 పడకల వైద్యశాలగా అప్ గ్రేడ్ పై స్థానిక ఎమ్మెల్యే పద్మావతి,జిల్లా కలెక్టర్ వెంకట్రావ్, ఆర్డీవో సూర్యనారాయణతో శనివారం సమీక్షించారు.ఒక సంవత్సరం లోపు కోదాడ ప్రభుత్వ వైద్యశాల 100 పడకల వైద్యశాలకు అవసరమై అన్ని వసతులతో భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలని ఎమ్మెల్యే సూచించారు.
సంబంధిత నిర్మాణ పనులకు కార్యాచరణను యుద్ధ ప్రాతిపదికన సిద్ధం చేయాలని ఆదేశించారు.పేద ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.రెవెన్యూ వైద్యశాఖ అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు.ఈ సమావేశంలో వైద్యశాల సూపర్డెంట్ డాక్టర్ దశరథ తదితరులు ఉన్నారు.