జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్లు ఇవ్వాలి

సూర్యాపేట జిల్లా:తెలంగాణ రాష్ట్రంలో ఇరవై వేల మందికి పైగా జర్నలిస్టులు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో కొనసాగుతున్నారని,వారిలో దాదాపు పది వేలకుపైగా జర్నలిస్టులు ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారని,వారి సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ స్టేట్ జర్నలిస్టు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కందుకూరి యాదగిరి ఆవేదన వ్యక్తం చేశారు.మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో అసోసియేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ చిన్న,పెద్ద మీడియా అని తేడా లేకుండా పనిచేస్తున్న ప్రతీ జర్నలిస్టును గుర్తించి అక్రిడిటేషన్ కార్డులు వెంటనే అందరికి ఇవ్వాలన్నారు.

 All Journalists Should Be Given Accreditations-TeluguStop.com

ఎంప్యానెల్ ఉన్న మీడియాను మాత్రమే గుర్తించి మిగతా మీడియాను గుర్తించకపోవడం విచారకరమన్నారు.ఈనాడు చిన్న మీడియా పెద్ద మీడియా తేడా లేకుండా సమాచారం అందుకున్న వెంటనే అధికారులు ప్రజా ప్రతినిధులు పనులు చేస్తున్న సంగతి గుర్తు చేశారు.

మీడియా ఏదైనా రాసిన సమాచారం అందిస్తున్న జర్నలిస్టులను గుర్తించి అక్రిడిటేషన్ లతో పాటు ఇంటి స్థలాలు ప్రత్యేక డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.రాష్ట్ర ప్రభుత్వం సిఎం కేసీఆర్,ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ,రాష్ట్ర సమాచార ప్రసార శాఖ కమీషనర్ లు స్పందించి కొందరికి మాత్రమే కాకుండా అందరికీ న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా దీక్షలకు దిగుతామని పేర్కొన్నారు.సూర్యాపేట పట్టణ అధ్యక్షుడు చిలుకల చిరంజీవి అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు దూపాటి శ్యాంబాబు,రాష్ట్ర ప్రచార సహాయ కార్యదర్శి దుర్గం బాలు,ఉమ్మడి నల్లగొండ జిల్లా సహాయ కార్యదర్శి కొరివి సతీష్ యాదవ్,ఉమ్మడి జిల్లా ప్రచార కార్యదర్శి హరి,సూర్యాపేట జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గట్టిగుండ్ల రాము,జిల్లా ఉపాధ్యక్షుడు ఎల్పీ నాగబాబు,మోతె మండల ప్రధాన కార్యదర్శి కొండా ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube