సరిగ్గా 20 ఏళ్ళ క్రితం విడుదల అయ్యి సంచలనం సృష్టించిన సినిమ ఖడ్గం.ఈ సినిమా విడుదల అయినా తర్వాత అనేక వివాదాలకు కారణం అయ్యింది.
ఒక మతం వారిని చెడుగా చూపించారని దర్శకుడు మరియు హీరో పై ఆగ్రహం వ్యక్తం చేసారు కొందరు.అయితే ఇది ఒక పార్శ్వం అయితే మరో పక్క గత రెండు దశాబ్దాలుగా ఇండిపెండెన్స్ డే వచ్చినా, రిపబ్లిక్ డే వచ్చిన టీవీల్లో ఖచ్చితంగా వచ్చే సినిమా ఖడ్గం.
ఈ సినిమాకు కృష్ణ వంశీ దర్శకత్వం వహించగా, హీర్లోలుగా శ్రీకాంత్, రవి తేజ మరియు ప్రకాష్ రాజ్ నటించారు.ఇక సంగీత సైతం ప్రధాన పాత్రలో నటించింది.
వీళ్ళే కాకుండా బ్రహ్మాజీ, కిమ్ శర్మ వంటి వారు కూడా ముఖ్య పాత్రల్లో నటించారు.
ఈ సినిమాలో మేమె ఇండియన్స్ అంటూ వచ్చిన పాట యూత్ ని బాగా ఆకర్షించింది.
ఇక సంగీతం అందించింది దేవి శ్రీ ప్రసాద్ కాగా ఖడ్గం సినిమాలో రెండు విభిన్నమైన అంశాలని క్రోడీకరిస్తూ కృష్ణ వంశీ చాల రిస్క్ చేసి సినిమా తీసాడు.ఒక వైపు దేశ భక్తి అంటూ శ్రీకాంత్ కి లవ్ స్టోరీ నడిపించడం, మరో పక్క సినిమా ఇండస్ట్రీ లో చాల మంది ఎదుర్కొంటున్న సమస్యలను, చాల సున్నితమైన విషయాలను కలుపుతూ సినిమా తీసాడు దర్శకుడు.
ఇక పల్లెటూరి నుంచి సినిమా హీరోయిన్ అయిపోదామని సిటీ కి వచ్చి ఒకే ఒక్క అవకాశం అంటూ నిర్మాత, దర్శకుడితో కాంప్రమైజ్ అయ్యే పాత్రలో సంగీత కనిపిస్తుంది.
ఇలా అనేక విషయాలను చాల లోతుగా అధ్యనం చేసి సినిమాల ప్రెజెంట్ చేయడం లో కృష్ణ వంశీ సక్సెస్ అయ్యాడు.అయితే సినిమా విడుదల అయినా సమయంలో మత కల్లోలాలు రేపే విధంగా చిత్రం ఉందని కృష్ణ వంశీ డైరెక్ట్ గా బెదిరించారు.ఇక శ్రీకాంత్ ని సైతం వార్నింగ్ కాల్స్ సతమతం చేసాయి.
అయినా కూడా సినిమా కోసం ఎక్కడ వెనక్కి తగ్గకుండా విడుదల చేసి కృష్ణ వంశీ ఒక పది రోజుల పాటు అండర్ గ్రౌండ్ కి వెళ్ళిపోయాడు.ఇక శ్రీకాంత్ సైతం ఎప్పుడు ఏమైనా జరగొచ్చు అని భయంతో జేబులో రివాల్వర్ పట్టుకొని తిరిగాడు.
ఇంత గొడవల మధ్య విడుదల అయినా ఈ సినిమా మంచి విజయం సాధించింది.