విద్యుత్ సంస్కరణల పేరుతో నల్లచట్టాలు

సూర్యాపేట జిల్లా:విద్యుత్ సంస్కరణల పేరుతో నల్ల చట్టాలు తెచ్చి ఆదాని లాంటి ప్రైవేట్ కంపెనీలకు లాభం చేకూర్చేందుకు బీజేపీ యత్నిస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి కేంద్రంపై విమర్శలు గుప్పించారు.శనివారం జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తయారు చేసిన విద్యుత్ రూ.50 వరకు అమ్ముకోవచ్చన్న కేంద్ర ఈఆర్సీ నిర్ణయం సరైనది కాదని విమర్శించారు.ప్రజలకు విద్యుత్ సౌకర్యాన్ని దూరం చేసేందుకు కేంద్రం కుట్రలు చేస్తుందని,ప్రైవేట్ వ్యక్తులకు ప్రజల డబ్బులు దోచిపెట్టేందుకే కేంద్రం ఈ దుర్మార్గం చేస్తుందని దుయ్యబట్టారు.

 Black Laws In The Name Of Electricity Reforms , Black Laws, Guntakandla Jagadish-TeluguStop.com

కేంద్రం తెచ్చేవి సంస్కరణలు కావని,ప్రజలను పీల్చిపిప్పి చేసే నల్ల విద్యుత్ చట్టాలని అన్నారు.విద్యుత్ విషయంలో కేంద్రం తప్పుడు విధానాలను అవలంబిస్తుందని,కేంద్ర నిర్ణయంతో సాధారణ ప్రజలపై తీవ్ర ప్రభావం పడుతుందని తెలిపారు.

రూ.50 వరకు అమ్ముకోవచ్చంటే ప్రజలను చీకట్లోకి నెట్టి దోపిడీ చేయడమేనని,దేశంలో సొంత బొగ్గువనరులు ఉండగా కేంద్రం విదేశీ బొగ్గు ఎందుకు తెస్తుందని ప్రశ్నించారు.ఆదాని విదేశీ బొగ్గును కేంద్రం బలవంతంగా రాష్ట్రాలకు అమ్మిస్తుందని,విదేశీ బొగ్గుతోనే విద్యుత్ సమస్య ఏర్పడనుందన్నారు.కేంద్ర ఈఆర్సీ నిర్ణయం ఆదానికే లాభమని, కృత్రిమ విద్యుత్ సంక్షోభం సృష్టించి ఆదానీకి మేలు చేయడమే కేంద్రం లక్ష్యంగా కనిపిస్తుందన్నారు.

కృత్రిమ విద్యుత్ సంక్షోభం సృష్టించి ప్రజలను ద్రోహం చేస్తున్న కేంద్రం,దేశభక్తి మాటున దేశానికి ద్రోహం చేస్తుందని మండిపడ్డారు.మోడీ,ఆదానీల స్నేహ బంధం ప్రజలకు అర్ధమౌతుందని,ప్రజలు బీజేపీ కుట్రలను తీపికొట్టాలని పిలుపునిచ్చారు.

నిర్మలా సీతారామన్ ఎవరిదో స్క్రిప్ట్ చదువతుతున్నారని,ఎఫ్ఆర్ బీఎం పరిధిలోనే రాష్ట్ర అప్పులు,అబద్దాలు చెప్పి ప్రజలకు దొరికిపోయిందన్నారు.పరిమితికి మించి అప్పులు చేసింది కేంద్రమేనని,తెలంగాణా అప్పులు ప్రజల అభివృద్ధి కోసం పెట్టుబడి పెట్టామని,ఏం చేసినా బీజేపీ ప్రజల ముందు దోషిగా నిలబడాల్సిందేనని చెప్పారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube