యాసంగి సాగుపై అన్నదాతల ఆందోళన

సూర్యాపేట జిల్లా:సాగర్ ఎడమ కాలువ ఆయకట్టు కింద యాసంగి సాగు( Yasangi Season )పై అన్నదాతలు అయోమయంలో పడ్డారు.వర్షాలు లేక,సాగర్ నీరు రాక రిజర్వాయర్లు అడుగంటి భూగర్భ జలాలు భారీగా తగ్గడంతో చెరువులు, బోర్లు,బావులు ఎండిపోతూ ఎండాకాలం రాకముందే నీటి కొరత ఏర్పడిందని సూర్యాపేట జిల్లా( Suryapet ) అనంతగిరి మండల పరిధిలోని వాయిలసింగారం రిజర్వాయర్ కింద సాగు చేసిన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 Farmers Difficulties In Yasangi Season,yasangi Season,farmers,suryapet,nsp Ae Sr-TeluguStop.com

వర్షాకాలంలో వర్షాభావ ప్రభావం వల్ల పంట దిగుబడి ఎక్కువ రాకపోవడంతో యాసంగి సీజన్లోనైనా వరి దిగుబడి వస్తుందేమోనని బావులు,చెరువులు,బోర్లకు మోటర్లు పెట్టి వరిసాగు చేస్తున్నామని,కానీ,భూగర్భ జలాలు పడిపోయి చుక్కనీరు రాకపోవడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డామని,సుమారు పది గ్రామాల ప్రజలు ఈ రిజర్వాయర్ పై ఆధారపడి ఉన్నామని అంటున్నారు.సాగర్ నీరు రాకపోతే ఎండాకాలంలో పంటలకే కాదు పశువులకు కూడా నీళ్లు ఉండకపోవచ్చని వాపోతున్నారు.

నీటి కొరతతో వరిసాగు బాగా తగ్గిందని అనంతగిరి ఏడీ వాసు అన్నారు.వానకాలం సీజన్లో సాగర్ నీరు రావడంతో 1లక్ష 20వేల ఎకరాలల్లో వరిసాగు చేశారని,యాసంగి సీజన్లో సాగర్ నీరు రాకపోవడంతో కేవలం 45 వేల ఎకరాలల్లో వరిసాగు చేస్తున్నారన్నారు.

సాగర్ నీళ్లు రావడం కష్టమేనని ఎన్ఎస్పీ ఏఈ శ్రీనివాస్ అంటున్నారు.వానకాలం సీజన్లో సాగర్ ఎడమ కాలువ ద్వారా నీళ్లు విడుదల చేస్తే కాలువలకు 15 రోజులకు ఒకసారి వరి సాగుకు నీరు అందించే విధంగా చర్యలు తీసుకున్నామని, కానీ,సాగర్ లో నీళ్లు లేకపోవడంతో యాసంగి వరి సాగుకు నీరు రావడం కష్టమేన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube