సూర్యాపేట జిల్లా: మునగాల మండల పరిధిలో హైదరాబాద్ -విజయవాడ 65వ జాతీయ రహదారి నుండి మొద్దుల చెరువు వయా రేపాల మోతె మండల కేంద్రంలోని సూర్యాపేట- ఖమ్మం 365వ జాతీయ రహదారిని కలుపుతూ సుమారు 14 కి.మీ.
ఉన్న ప్రధాన రహదారి ఏళ్ల తరబడి డబుల్ రోడ్డుకు నోచుకోక ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిందని ఆ ప్రాంత ప్రజలు,ప్రయాణికులు,వాహనదారులు వాపోతున్నారు.మోతె మండలం( Mothey mandal )లోని 29 గ్రామాల ప్రజలు నియోజకవర్గ కేంద్రం కోదాడకు,మునగాల మండలంలోని 6 గ్రామాల ప్రజలు,రైతులు,విద్యార్దులు,వ్యాపారస్తులు,వివిధ రకాల పనుల మీద మండల,నియోజకవర్గ, జిల్లా కేంద్రాలకు,ఇతర ప్రాంతాలకు వెళ్ళాలంటే ఈ రోడ్డు గుండానే వెళ్ళాలి.
అంతేకాకుండా రేపాలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం,బ్యాంక్,మీ సేవ,పశువుల ఆసుపత్రి, విద్యుత్ సబ్ స్టేషన్, సోషల్ వెల్ఫేర్ హాస్టల్,హైస్కూల్, వంటి మండల కేంద్రం లాంటి సౌకర్యాలు ఉండడంతో ఉద్యోగులు, ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు.అదే విధంగా మోతె,మునగాల మండలాల్లో పని చేసే ఉద్యోగ,ఉపాధ్యాయ,కార్మికులకు,రైతులకు ఇదే ప్రధాన రహదారి,అనేక మూల మలుపులతో పాము వంకర్లు తిరిగి ఉండడంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక జరిగిన ప్రమాదాల్లో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు.
ప్రతీ ఏటా మార్చిలో వారం రోజుల పాటు జరిగే అత్యంత ప్రసిద్ది చెందిన శ్రీరేపాల లక్ష్మీనరసింహ స్వామి( Sri Lakshmi Narasimha Swamy ) బ్రహ్మోత్సవాల సమయంలో వేలాది మంది భక్తులు ఈ రోడ్డు గుండానే ప్రయాణం చేయాల్సి ఉంటుంది.నిత్యం అత్యంత రద్దీగా ఉండే ఈ సింగిల్ రోడ్డును డబుల్ రోడ్డు చేయడానికి పాలకులు చొరవ చూపకపోవడం విస్మయం కలిగిస్తుంది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈ రోడ్డును డబుల్ చేయడానికి ఐదేళ్ల క్రితం సర్వే కూడా చేశారు.నిధులు కూడా మంజూరు అయ్యాయని తెలిసింది.
ఏమైందో ఏమో కానీ, ఐదేళ్లుగా ఆ ఊసే ఎత్తడం లేదు.అసలు మంజూరైన రోడ్డు పనులు ఎందుకు ఆపాల్సిన వచ్చిందనేది ఎవరికీ అంతచిక్కడం లేదని ఈ ప్రాంత ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికైనాస్థానిక ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి( MLA Padmavathi Reddy ),జిల్లా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిచొరవ తీసుకుని మొద్దుల చెరువు నుండి మోతె వరకు ఆర్ అండ్ బి రోడ్డును డబుల్ రోడ్డుగా మార్చి ప్రజల రవాణా వ్యవస్థను మెరుగుపరచాలని,ప్రజల ప్రాణాలను కాపాడాలని కోరుతున్నారు.
హైదరాబాద్-విజయవాడ ఎన్ హెచ్ 65,సూర్యాపేట- ఖమ్మం మధ్య నూతనంగా నిర్మించిన ఎన్ హెచ్ 365 రహదారులను కలిపే ఈ సింగిల్ రోడ్డు డబుల్ రోడ్డు చేయకుండా గత ప్రభుత్వం విస్మరించిందనినర్సింహులగూడెం గ్రామానికి చెందిన జూలకంటి విజయలక్ష్మిఆరోపించారు.
అనేక గ్రామాల నుండి వివిధ ప్రభుత్వ పనుల కోసం రేపాలకు వచ్చిపోతుంటారని,ఈ ప్రభుత్వంలోనైనా డబుల్ రోడ్డు నిర్మాణం చేయాలనిఅన్నారు.రాకపోకలకు తగ్గట్లుగా రోడ్డు లేక ఇబ్బందులు పెడుతున్నామనిరేపాల గ్రామానికి చెందినపొనుగోటి రంగా తెలిపారు.
సుమారు 14 కి.మీ.ఉన్న ఈ రోడ్డు ఏళ్ల తరబడి అభివృద్ది లేక అధ్వాన్నంగా తయారైందని,సింగిల్ రోడ్డు వలన నిత్యం ప్రమాదాలుజరుగుతున్నాయని,ఇరుపక్కల అక్రమనకు గురవుతుందని,రహదారిని డబుల్ రోడ్డుగా మార్చడానికి సర్వేలు చేశారు.కానీ,అడుగు ముందుకు పడలేదన్నారు.
కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి చొరవ తీసుకొని డబుల్ రోడ్డు శాంక్షన్ చేయాలని,ఏళ్ల నుంచి రోడ్డు కోసం ఎదురు చూస్తున్నామని,మమ్మల్ని పట్టించుకునే నాథుడే కరువయ్యాడని విజయరాఘవాపురం గ్రామానికి చెందిన పాలపాటి ప్రవీణ్ కుమార్ అన్నారు.ప్రజా ప్రభుత్వంలో మా చిరకాల స్వప్నం నెరవేరుతుందని ఆశాభావంతో ఉన్నామన్నారు.