సూర్యాపేట జిల్లా:బలిదానాలతో సాధించుకున్న తెలంగాణ కేసీఆర్ కుటుంబ కబంధ హస్తాలలో చిక్కుకుపోయిందని,కేసీఆర్ కుటుంబ అవినీతి పాలన నుండి తెలంగాణను విముక్తి చేసి,ఉద్యమ ఆకాంక్షల సాధనే లక్ష్యంగా తెలంగాణ జనసమితి ఆవిర్భవించిందని తెలంగాణ జనసమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మార్జున్ అన్నారు.తెలంగాణ జనసమితి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో పార్టీ జెండా ఎగురవేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతోందని,కమీషన్లే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ విధానాలు కొనసాగుతున్నాయని,ఎమ్మెల్యేలు,మంత్రులు అదే దారిన నడుస్తున్నారని,సూర్యాపేట నియోజకవర్గంలో మంత్రి జగదీష్ రెడ్డి అభివృద్ది ముసుగులో “పేటలో అవినీతి కోటను” నిర్మిస్తున్నారని,మంత్రి అనుచరులు,భూ ఆక్రమణలు,సెట్టిల్మెంట్ దందాలు చేస్తున్నారన్నారని,సూర్యాపేటలో అధికార పార్టీ నాయకులు గంజాయి మాఫియా నడుపుతున్నారని ఆరోపణలు గుప్పించారు.
తెలంగాణ జనసమితి కార్యకర్తలు అవినీతి రాజకీయాలకు వ్యతిరేకంగా భావజాలవ్యాప్తి చేస్తూ ప్రజాఉద్యమాల ద్వారా స్వచ్ఛరాజకీయాలు చేస్తూ జనసమితి గెలుపుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.రాష్ర్టనాయకులు గట్ల శంకర్ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు మాంద్ర మల్లయ్య,పట్టణ అధ్యక్షుడు బంధన్ నాయక్ నాయకత్వంలో పట్టణంలో వివిధ ప్రాంతాలలో జనసమితి జెండాలు ఎగురవేశారు.
అనంతరం పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో యువజన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు నారాబోయిన కిరణ్,యువజన సమితి రాష్ట్ర నాయకులు బొడ్డు శంకర్,పార్టీ ప్రధాన కార్యదర్శి పగిళ్ళ శ్రీను,లీగల్ సెల్ జిల్లా భాద్యులు కుంచం చంద్రకాంత్,మైనారిటీ సెల్ జిల్లా కన్వీనర్ రఫీ,ఎస్సి సెల్ జిల్లా కన్వీనర్ బచ్చలకురి గోపి, విద్యార్థి జనసమితి జిల్లా అధ్యక్షుడు వినయ్ గౌడ్, ఉపాద్యక్షుడు ఈశ్వర్ సింగ్,జిలా ఎస్టీసెల్ భాద్యులు సుమన్ నాయక్,పట్టణ కన్వీనర్ దేవత్ సతీష్, యువజన సమితి పట్టణ అధ్యక్షుడు శివ,పట్టణ పార్టీ ఉపాద్యక్షుడు బీసు స్వామి,నాగరాజు తదితరులు పాల్గొన్నారు.