ప్రజా వ్యతిరేక బడ్జెట్:మట్టిపల్లి సైదులు

సూర్యాపేట జిల్లా:పార్లమెంట్ లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్( Nirmala Sitharaman ) మంగళవారం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజా వ్యతిరేక బడ్జెట్ అని,ఈ బడ్జెట్ వ్యవసాయ కార్మికులు,గ్రామీణ పేదలకు వ్యతిరేకమైన బడ్జెట్ అని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు అన్నారు.ఈ బడ్జెట్ లో కార్పొరేట్ శక్తులను, విదేశీ పెట్టుబడి దారుల సంతృప్తి పరచడం తప్ప, దేశంలోని ప్రజల కష్టాలను తీర్చే బడ్జెట్ కాదన్నారు.ఆహార ఉత్పత్తి ధరలు 3.8 నుండి 7.5 శాతంకు పెరిగాయన్నారు.గత బడ్జెట్ లో ఆహార భద్రతకు రూ.2,12 వేల కోట్లు కేటాయించిన ప్రభుత్వం,ఈ బడ్జెట్ లో రూ.2000 వేల కోట్ల తగ్గించిందన్నారు.ఈ కేటాయింపులు చూస్తే ఆహార భద్రతను పూర్తిగా విస్మరించినట్టుగా ఉందన్నారు.నేషనల్ క్రైమ్ బ్యూరో ప్రకారం రైతుల ఆత్మహత్యల కంటే గ్రామీణ పేదల ఆత్మహత్యలు రోజురోజుకు పెరుగుతున్నాయన్నారు.

 Anti-public Budget Mattipally Sidhu , Mattipally Sidhu , Nirmala Sitharaman, Pra-TeluguStop.com

గ్రామీణ ప్రాంతంలో 70% గా ఉన్న ఉపాధి కూలీలకు గత బడ్జెట్లో 86 వేల కోట్లు కేటాయించార ని,ఈ సంవత్సరం కూడా 86 వేల కోట్లు మాత్రమే కేటాయించి చేతులు దులుపుకుందన్నారు.ఉపాధి హామీకి రెండు లక్షల కోట్లు కేటాయించాల్సి ఉందన్నారు.

ఉపాధి కూలీల వేతనాల పెంపు,వ్యవసాయ కార్మికుల కూలీల పెంపు వంటి ప్రతిపాదనలు బడ్జెట్ లో లేకపోవడం సిగ్గుచేటన్నారు.వృద్ధులు,వితంతువులు, వికలాంగులకు 9600 కోట్ల రూపాయలు గత సంవత్సరం కేటాయించిన ప్రభుత్వం, స్వల్పంగా 9652 కోట్ల రూపాయలు కేటాయించిందన్నారు.

విద్య, వైద్యానికి నిధుల కేటాయింపుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు.ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద గత సంవత్సరం 54 వేలకోట్లు కేటాయించారని,32 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube