లోకాయుక్త ఇన్విస్టిగేషన్ అధికారిపై లోకయుక్తకు ఫిర్యాదు

సూర్యాపేట జిల్లా:మోతె మండల పరిధిలోని క్యారీ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తుందని 2024 జూలై 5 న సామాజిక కార్యకర్త మాతంగి ఏసుబాబు లోకాయుక్త కమిషన్లో ఫిర్యాదు చేస్తే,కేసు నెంబర్ 430/2024/B1 ఫిర్యాదుపై శుక్రవారం ఇన్విస్టిగేషన్ చేయడానికి వచ్చిన అధికారి మాత్యూ కోషి అంతా మంచిగానే ఉందని బహిరంగ పత్రికా ప్రకటన చేసి,తాను తప్పుడు ఫిర్యాదు ఇచ్చానని నిందించడం పేపర్లో చూసి మాతంగి ఏసుబాబు అనే సామాజిక కార్యకర్త లోకయుక్తకు రిజిస్టర్ పోస్ట్ ద్వారా అతనిపై ఫిర్యాదు చేశాడు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇన్విస్టిగేషన్ చేయడానికి వచ్చిన అధికారి బహిరంగంగా పత్రిక ప్రకటన చేయడమేంటని,ఫిర్యాదు చేసిన తనను తప్పుపట్టడం ఏంటని ప్రశ్నించారు.

 Complaint To Lokayukta Against Lokayukta Investigation Officer , Lokayukta Inve-TeluguStop.com

జాతీయ రహదారి పక్కనే క్వారీ ఉన్న మాట వాస్తవం కాదా? ఎస్సారెస్పీ కాలువను అక్రమించుకుని రహదారిగా వాడుకుంటున్నది నిజం కాదా? అని ఫిర్యాదులో పొందుపరిచానని,పిటిషన్ దారుడైన నన్ను పత్రిక ప్రకటనల ద్వారా భయబ్రాంతులకు గురిచేస్తున్నారని,ఇన్విస్టిగేషన్ చేయడానికి వచ్చిన అధికారి ఏకపక్షంగా విచారణ చేయడం నన్ను మానసిక క్షోభకు గురిచేసిందని,ఆ అధికారిపై చర్యలు తీసుకోవాలన్నారు.అదేవిధంగా క్వారీ యజమాని అయిన వంగాల కిరణ్ గౌడ్ తో నాకు,నా కుటుంబానికి ప్రాణహాని ఉందని లోకయుక్తకు రిజిస్టర్ పోస్ట్ చేసినట్లు తెలిపాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube