సూర్యాపేట జిల్లా:మామూళ్ల మత్తులో జోగుతున్న ఎక్సైజ్ అధికారులపై చర్యలు తీసుకోవాలని సిపిఎం సూర్యాపేట జిల్లా కమిటీ సభ్యులు బుర్రి శ్రీరాములు డిమాండ్ చేశారు.శనివారం మునగాల మండల కేంద్రంలోని సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కోదాడ నియోజకవర్గంలో మద్యం సిండికేట్ మామూళ్ల వ్యవహారం గురించి గతవారం రోజులుగా పత్రిక, మాధ్యమాల్లో వస్తున్న విషయం మీద ఎవరూ నోరు మెదపకుండా తేలుకుట్టిన దొంగల్లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
మద్యం సిండికేట్ దందాను అడ్డుకోవాల్సిన ఆఫీసర్లు మామూలు మత్తులో మునిగి వారికే సహకరిస్తున్నారని ఆరోపించారు.జిల్లా కలెక్టర్, సంబంధిత అధికారులు కోదాడలో మద్యం సిండికేట్ లో జరుగుతున్న అవినీతిపై విచారణ జరిపించి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మద్యాన్ని అక్రమంగా బెల్ట్ షాపుల ద్వారా అధిక ధరలకు ప్రజలకు అందిస్తున్న వైన్ షాప్ ల లైసెన్సులు రద్దు చేయాలని కోరారు.ఇదే అదునుగా భావించిన బెల్టు షాపుల నిర్వాహకులు ఒక్కో క్వాటర్‌పై 30 నుండి50 రూపాయలు అధికంగా వసూలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారని,మద్యం వ్యాపారుల సిండికేట్ గా ఏర్పడి బెల్టు షాపులను ప్రోత్సహిస్తున్నారని,దీనికి సహకరిస్తున్న ఎక్సైజ్,పోలీస్ శాఖ అధికారులపై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో సీపీఎం మండల పార్టీ నాయకులు స్వరాజ్యం,వెంకన్న తదితరులు పాల్గొన్నారు.