సూర్యాపేట జిల్లా: మునగాల మండలం గణపవరం గ్రామంలో ఏర్పాటు చేసిన మహాత్మ జ్యోతిబాపూలే,డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్,బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాల ఆవిష్కరణ ఈనెల 31న జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు.
శనివారం శనివారం గ్రామంలోని అంగన్వాడి కేంద్రంలో ఏర్పాటు చేసిన కమిటీ సమావేశంలో వారు మాట్లాడుతూ
మహనీయుల విగ్రహాల ఆవిష్కరణకు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ,భరత్ భూషణ్ ఓయూ ప్రొఫెసర్ కాసిం హాజరవుతున్నట్లు తెలిపారు.అదే విధంగా జిల్లాలోని వివిధ రాజకీయ,ప్రజా సంఘాల, కుల సంఘాల జిల్లా నాయకులు పాల్గొంటారని, ఆవిష్కరణ అనంతరం జరిగే బహిరంగ సభకు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.