జిల్లాలో నెంబర్ ప్లేట్ లేని వాహనాల జోరు

సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రంలో సరైన పత్రాలు మరియు నిబంధనలకు విరుద్దంగా వాహనాలు నడిపేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది.అందువల్ల ముఖ్యంగా జిల్లాలో నేరాలకు,అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారిని గుర్తించడం పోలీసులకు ఇబ్బందికరంగా మారడంతో ఈరోజు ఉదయం స్థానిక ఖమ్మం క్రాస్ రోడ్డులో ట్రాఫిక్ ఎస్సై నరేష్ ముప్పై నిమిషాలు స్పెషల్ డ్రైవ్ లో వాహనదారులను ఆపి పరిశీలించగా సుమారు ముప్పై మంది నెంబర్ ప్లేట్,ఇన్సూరెన్స్,హెల్మెట్ లేని వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు.

 Noise Of Unlicensed Vehicles In The District-TeluguStop.com

అరగంటలో ఇంతమంది నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపితే,మరి ఒక్కరోజులో ఎంతమంది ప్రయాణం చేస్తుంటారో అర్థం చేసుకోవచ్చు.విషయం తెలుసుకున్న టౌన్ సిఐ ఆంజనేయులు అక్కడికి చేరుకొని మాట్లాడుతూ వాహనదారులకు పూర్తి అవగాహన కల్పించారు.

మరోసారి నిబంధనలను ఉల్లంఘించి వాహనాలు రోడ్డెక్కితే కఠిన శిక్షలకు భాద్యులవుతారని హెచ్చరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube