నల్లగొండ జిల్లా:అన్ని రంగాలలో దినదినాభివృద్ధి చెందుతున్న కొండమల్లేపల్లి మండలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల మరియు సంక్షేమ హాస్టళ్లు (వసతి గృహాలు) ఏర్పాటు చేయాలని ఎన్.ఎస్.
యు.ఐ తెలంగాణ స్టేట్ కో-ఆర్డినేటర్ ఎం.డి.ఖదీర్ డిమాండ్ చేశారు.కొండమల్లేపల్లి మండలంలో ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాల్లో సంవత్సరనికి దాదాపుగా 800 నుంచి 1000 మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలు రాస్తున్నారని, ఇందులో చాలా మంది విద్యార్థులు స్థానికంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల లేక హైదరాబాద్,నల్గొండ, మిర్యాలగూడ లాంటి పట్టణాలకు వెళ్లి వేలల్లో ఫీజులు కడుతూ ఇబ్బందులు పడుతున్నారని అవేదన వ్యక్తం చేశారు.కొంతమంది విద్యార్థులు దేవరకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్నారని,దూరప్రాంతల నుంచి వచ్చే విద్యార్థులు దేవరకొండకు సరైన బస్ సౌకర్యం లేక తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారన్నారు.
అలానే ఆర్ధికంగా స్థోమత లేని విద్యార్థులు పదవ తరగతి నుంచే విద్యకు దూరమై దుకాణాలాల్లో కూలీలుగా,గుమాస్తులుగా పని చేస్తున్నారన్నారు.అదేవిదంగా ప్రస్తుతం ప్రైవేట్,ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న సుదూర ప్రాంత విద్యార్థులకు సంక్షేమ వసతి గృహాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారని,వచ్చే విద్యా సంవత్సరం కల్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల మరియు సంక్షేమ వసతి గృహాలు ఏర్పాటు చెయ్యాలని డిమాండ్ చేశారు.
లేనియెడల ఎన్.ఎస్.యు.ఐ ఆధ్వర్యంలో పెద్ద ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.