కాంగ్రెస్ పార్టీవి బఫూన్ మాటలు:మంత్రి జగదీష్ రెడ్డి

సూర్యాపేట జిల్లా: హైదరాబాద్ తుక్కుగూడ సభలో కాంగ్రెస్ హామీలపై సోమవారం మంత్రి జగదీష్ రెడ్డి( Minister Jagdish Reddy ) తీవ్రంగా స్పందించారు.కాంగ్రెస్ పార్టీ( Congress party )వన్నీ బోగస్ హామీలని,ప్రజలను మోసగించడం కాంగ్రెస్ అలవాటని,కాంగ్రెస్ చరిత్ర ఎప్పుడూ ప్రజల వైపు లేదన్నారు.

 Minister Jagdish Reddy Comments Oncongress Party , Minister Jagdish Reddy , Con-TeluguStop.com

ఇచ్చిన హామీలు నెరవేర్చిన చరిత్ర కాంగ్రెస్ కు లేదని,దేశంలో ఆకలి దారిద్ర్యాలకు కారణం కాంగ్రెస్ పార్టీనేనని,అబద్ధపు హామీలు ఇచ్చే అలవాటు లేని నేత కేసీఆర్ ఒక్కరేనని అన్నారు.

అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలు ఇచ్చిన హామీలు భఫూన్,బుడ్డర్ ఖాన్ లను తలపించేలా ఉన్నయన్నారు.

ఒక్కటి అంటే ఒక్కటి కూడా అమలు చేయగలిగినవి లేవని,కాంగ్రెస్ వాళ్లు ఏలుతున్న ఏ ఒక్క రాష్ట్రంలో కూడా నిన్న ప్రకటించిన పథకాలు లేవని,కాంగ్రెస్ అబద్ధాలు చెప్పి ప్రజలను మోసగించాలని చూస్తుందని ధ్వజమెత్తారు.చైతన్యవంతులైన తెలంగాణ ప్రజల ముందు కాంగ్రెస్ పాచికలు పారవని,కేసీఆర్ ( CM KCR )నాయకత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అన్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube