సూర్యాపేట జిల్లా:పోలీసు శాఖలో పని చేస్తూ అకాల మరణం పొందిన సిబ్బంది కుటుంబాలను తెలంగాణ పోలీసు శాఖ అన్ని విధాలుగా ఆదుకుంటుందని, దివంగత సిబ్బంది కుటుంబాలకు పోలీసు భద్రత స్కీమ్ బాసటగా నిలుస్తుందని జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ అన్నారు.ఆర్ముడ్ రిజర్వ్ నందు హెడ్ కానిస్టేబుల్ గా పని చేస్తున్న కృష్ణయ్య అనారోగ్యంతో మరణించగా,కృష్ణయ్య కుటుంబ సభ్యులకు పోలీసు భద్రత యాక్సిడెంటల్ ఇస్యూరెన్స్ స్కీం కింద మంజూరైన రూ.4.8 లక్షల చెక్కును సోమవారం జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో ఆయన అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృష్ణయ్య కుటుంబం యొక్క సంక్షేమానికి కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రితిరాజ్,డిఎస్పీ రఘు,ఏఓ సురేష్,జిల్లా పోలీసు సంఘం అధ్యక్షులు రామచందర్ గౌడ్,ఇతర సిబ్బంది పాల్గొన్నారు.




Latest Suryapet News