సీఎల్పీ నేత భట్టితో రాంరెడ్డి దామోద‌ర్ రెడ్డి భేటీ...!

నల్లగొండ జిల్లా:సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో ( Mallu Bhatti Vikramarka )మాజీ మంత్రి రామిరెడ్డి దామోదర్ రెడ్డి మంగళవారం భేటీ అయ్యారు.నకిరేకల్ నియోజకవర్గ కేంద్రమైన జాతీయ రహదారి పక్కన ఏర్పాటు చేసిన పాదయాత్ర శిబిరం వద్దకి రామిరెడ్డి దామోదర్ రెడ్డి వచ్చి భట్టిని కలిశారు.

 Ram Reddy Damodar Reddy Met Clp Leader Bhatti...!-TeluguStop.com

బుధవారం సాయంత్రం సూర్యాపేట జిల్లా వెదిరేవారిగూడెంలో భట్టి విక్రమార్క పాదయాత్ర అడుగుపెట్టనున్నారు.ఈనెల 21,22,23 తేదీల్లో సూర్యాపేట జిల్లాలో పీపుల్స్ మార్చ్ పాదయాత్ర కొనసాగనుంది.22 న సూర్యాపేట( Suryapet ) పట్టణంలో కార్నర్ మీటింగ్ ఉంటుంది.

మూడు రోజులపాటు సూర్యాపేటలో జరిగే పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ఏర్పాట్లు, కార్నర్ మీటింగ్ విజయవంతం కోసం ఇద్దరు నేతలు చర్చినట్లు తెలుస్తుంది.

పాదయాత్రను విజయవంతం చేయడానికి క్యాడర్ ను ఇప్పటికే సన్నాహాకం చేశామని అక్కడ చేస్తున్న ఏర్పాట్ల గురించి దామోదర్ రెడ్డి ( Ram Reddy Damodar Reddy )సీఎల్పీ నేత భట్టికి వివరించారు.సూర్యాపేట నియోజకవర్గంలో పాదయాత్ర విజయవంతం కోసం దామోదర్ రెడ్డికి భట్టి విక్రమార్క అభినందనలు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube