పొలంలో వరి కొయ్యలకు నిప్పు పెట్టి రైతు మృతి...!

సూర్యాపేట జిల్లా:పొలంలో వరి కొయ్యలకు నిప్పుపెట్టగా భారీ మొత్తంలో పొగ కమ్ముకోవడంతో ఊపిరాడక సూర్యాపేట జిల్లా( Suryapet District ) మునగాల మండలంనేలమర్రి గ్రామానికి చెందినచామకూరి సూర్యనారాయణ(68)( Suryanarayana ) అనే రైతు అక్కడిక్కడే మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మృతుడు చామకూరి సూర్యనారాయణ మంగళవారం తన పొలంలో వరి కోయ్యలకు నిప్పు పెట్టారు.

 A Farmer Died After Setting Fire To Rice Sticks In The Field...! Police , Farme-TeluguStop.com

మంటలు పక్క పొలాలకు వ్యాపించడంతో కంగారుపడి మంటలను ఆర్పే ప్రయత్నంలో దట్టమైన పొగ వ్యాపించి ఊపిరాడక పొలంలోనే పడిపోయి మృతి చెందాడు.సాయంత్రం వరకూ ఇంటికి రాకపోవడంతో మృతుని కుమారుడు కాశీపతి పొలం వద్దకు వెళ్ళి చూడగా పొలంలో శవమై కనిపించాడు.

కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకుమునగాల పోలీసులుPolice ) కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube