సూర్యాపేట జిల్లా:కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య( Unemployment Problems ) పట్టిపీడిస్తుందని,విద్యార్థి,నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం అగ్రభాగాన నిలబడి పోరాడుతామని తెలంగాణ విద్యార్థి జేఏసీ, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాల జేఏసీ చైర్మన్ మిడతనపల్లి విజయ్( JAC Chairman Midathanapalli Vijay ) అన్నారు.
గురువారం సాయంత్రం తెలంగాణ రాష్ట్ర విద్యార్థి సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన తెలంగాణ రాష్ట్ర యూనివర్సిటీల విద్యార్థి నిరుద్యోగ భరోసా బస్సు యాత్ర( Nirudyooga Bus Yatra ) జిల్లా కేంద్రానికి చేరుకున్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిఎస్పిఎస్సి పేపర్ లీకేజీ వల్ల విద్యార్థులు ఆత్మస్తైర్యం కోల్పోయారని, ఆత్మ స్థైర్యం కోల్పోవద్దని, చదువుతూ కొట్లాడాలని సూచించారు.
మన రాష్ట్రం మనకొస్తే మన ఉద్యోగాలు మనకొస్తాయని ఉద్యమం చేసి రాష్ట్రాన్ని సాధించుకున్నామని ఉద్యోగాల కోసం పరీక్షలు పెట్టలేని స్థితిలో ప్రభుత్వం ఉందని విమర్శించారు.నిరుద్యోగుల బాధలు ప్రభుత్వానికి కనిపించడం లేదని,రాష్ట్ర వచ్చిందని కూర్చుంటే న్యాయం జరగదని,కొలువుల కోసం కొట్లాడే సమయం వచ్చిందన్నారు.
విద్యార్దులు,నిరుద్యోగులు సీరియస్ గా తీసుకొని పోరాడాలని పిలుపునిచ్చారు.పేపర్ లీకేజీ( Paper Leakage ) వల్ల విద్యార్థులు ఆత్మ స్టైర్యం కోల్పోయి ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు జరిగాయని, లీకేజీ పేపర్లను తగలబెట్టి, కారకులైన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి టిఎస్పిఎస్సీ కమిటీని( TSPSC Committee ) రద్దు చేయాలన్నారు.
ఈ భరోసా యాత్ర తరువాత విద్యార్ది నిరుద్యోగుల సమస్యలు రాష్ట్ర ముఖ్యమంత్రికి వినిపించేలా అన్ని విద్యార్ధి,ప్రజా సంఘాలను కలుపుకొని భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఓయూ విద్యార్థి జేఏసీ నాయకులు రెడ్డి శ్రీనివాస్ ముదిరాజ్,ఆంజనేయులు ముదిరాజ్,వెంకట్ యాదవ్,టీ.
నిరంజన్ యాదవ్,వీరరాజు,ఎం.మహేష్,మోహన్ నాయక్, వినోద్,రమేష్,జనార్దన్ ముదిరాజ్,అశోక్,రవి, సురేష్,రాజేందర్,నవీన్, రామకృష్ణ,సురేందర్, రవీందర్,అజయ్ తదితరులు పాల్గొన్నారు.