సూర్యాపేట జిల్లా:హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని మఠంపల్లి మండల కేంద్రంలో దురాక్రమణకు గురవుతున్న కోట్ల విలువ చేసే 20ఎల్ కేనాల్ పంట కాలువ భూములను కాపాడాలని నీటిపారుదల శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు స్థానిక రైతు బూడిగే హుస్సేన్ గౌడ్ బుధవారం తెలిపారు.మండల కేంద్రంలోని కేనాల్ భూములపై స్థిరాస్తి వ్యాపారుల కన్ను పడి రెవిన్యూ,ఇరిగేషన్, పంచాయతీ రాజ్ అధికారుల అండతో కెనాల్ భూములు ఆక్రమించి అడ్డదారిలో అనుమతులు పొంది కోట్ల విలువచేసే కెనాల్ భూములను కబ్జా చేస్తున్నారని ఆరోపించారు.
పంట కాలువ నిర్మాణం కోసం మూడు గ్రామాల రైతుల నుండి 24.01ఎకరాల భూమిని 1970 లో ప్రభుత్వం రైతులకు నష్టపరిహారం చెల్లించి కాలువ నిర్మాణం చేశారని అన్నారు.ప్రధాన పంట కాలువ గత కొన్ని ఏళ్లుగా వందల ఎకరాలకు సాగు నీరందించిన చరిత్ర ఉందన్నారు.మఠంపల్లి మండల కేంద్రం ఆంద్ర రాష్ట్రానికి వెళ్లేందుకు కృష్ణా నదిపై వంతెన ఏర్పాటు చేయటం, ఇండస్ట్రియల్ ప్రాంతం కావడంతో ఇక్కడ భూములకు ఒక్కసారిగా రెక్కలొచ్చి మండల కేంద్రంలోని విలువైన కెనాల్ భూములను ఆక్రమిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
భూసేకరణ కెనాల్ భూమిని రెవిన్యూ రికార్డుల్లో నమోదు చేయకపోవడంతో స్థిరాస్తి వ్యాపారులు కెనాల్ భూమి కబ్జా చేసి కోట్లల్లో విక్రయిస్తూ భవంతులు నిర్మాణాలు చేస్తూ పంట కాలువ రూపురేఖలు మార్చేస్తున్నారన్నారు.ఇప్పటికైనా నీటిపారుదల శాఖ అధికారులు స్పందించి భవిష్యత్ తరాల రైతాంగ పంట కాలువను