గ్రూప్ 1 పరీక్షను 48 గంటల్లో రద్దు చేయాలి: బీఎస్పీ

సూర్యాపేట జిల్లా: రాష్ట్రంలో ఉన్నత విద్యలు పూర్తి చేసి,ఉద్యోగాల కోసం కోచింగ్ సెంటర్లలో ఏళ్ల తరబడి శిక్షణ పొందుతున్న నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడితే బీఎస్పీ చూస్తూ ఊరుకోదని,పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని బీఎస్పీ రాష్ట్ర ఈసీ మెంబర్ పిల్లుట్ల శ్రీనివాస్ అన్నారు.గురువారం ఆయన కోదాడ బీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ గ్రూప్ 1 పరీక్షను 48 గంటల్లో రద్దు చేయాలని బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్.

 Group 1 Exam To Be Canceled Within 48 Hours Bsp , Pillutla Srinivas, Bsp, Bsp S-TeluguStop.com

ఎస్.ప్రవీణ్ కుమార్ చేపట్టే దీక్షకు నిరుద్యోగులు సిద్ధం కావాలన్నారు.టౌన్ ప్లానింగ్ ఎఈ పోస్టుల పరీక్షా పేపర్ లీకేజీలో ప్రభుత్వ హస్తం ఉందని,పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జీ చేత విచారణ జరపాలని, నీళ్ళు నియామకాలు అనే హామీలతో నిరుద్యోగులను మోసం చేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వం గద్దె దించాలనే డిమాండ్లతో కోదాడలో బీఎస్పీ ఆధ్వర్యంలో జరిగే నిరసన దీక్షకు నిరుద్యోగ యువత వందలాదిగా తరలిరావాలని పిలుపునిచ్చారు.ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం వల్ల 33 మంది నిరుద్యోగులు తీవ్ర మనోవేదనకు చెందుతున్నారని అవేదన వ్యక్తం చేశారు.

పేపర్ లీకేజీలో ప్రధాన పాత్రదారి ప్రవీణ్ అయితే అసలు సూత్రధారులు అధికార పార్టీ నాయకులేనని ఆరోపించారు.గతంలో నిర్వహించిన పరీక్షలపై కూడా విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

ఈ సమావేశంలో బీఎస్పీ కోదాడ నియోజకవర్గ ఇన్చార్జి భీమయ్య గౌడ్, నియోజకవర్గ అధ్యక్షులు కందుకూరి ఉపేందర్, ఉపాధ్యక్షులు చింతల రమేష్,మహిళా కన్వీనర్ అంతోటి జ్యోతి,సోషల్ మీడియా కన్వీనర్ షేక్ షర్మిల తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube