తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ నేత లక్ష్మణ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.అవినీతి కేసులను మూసివేయడంతో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని ఆయన విమర్శించారు.
పోలీస్, నిఘా వ్యవస్థలను రాజకీయంగా వాడుకుంటున్నారని లక్ష్మణ్ ఆరోపించారు.తెలంగాణ సర్కార్ కు లీకులు ఏమి కొత్త కాదంటూ విమర్శలు గుప్పించారు.
గ్రూప్ -1 పరీక్షపై అనేక అనుమానాలు ఉన్నాయని చెప్పారు.ఈ వ్యవహారంలో ఇద్దరు చిన్న ఉద్యోగులను అరెస్ట్ చేసి చేతులు దులుపుకున్నారని పేర్కొన్నారు.
పరీక్షను ఆలస్యం చేసి యువతను మభ్య పెట్టే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.







