ప్రతి అమ్మాయి తన ముఖం అందంగా,కాంతివంతంగా ఉండాలని కోరుకోవటం సహజం.ముఖ మెరుపు కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ ఎంతో డబ్బును ఖర్చు పెట్టేస్తూ ఉంటారు.
అయినా పెద్దగా ఫలితం ఉండదు.డబ్బు ఆదా చేస్తూ మన ఇంటిలోనే సులభంగా నిమిషాల్లో ముఖాన్ని అందంగా మెరిసేలా చేయవచ్చు.
ఈ చిట్కా చేయటం చాలా సులభం.అలాగే చేసుకోవటం కూడా చాలా సులువు.
ఈ చిట్కా కోసం మనం మూడు వస్తువులను మాత్రమే ఉపయోగిస్తున్నాం.
ENO – 1 పాకెట్నిమ్మరసం – 1 స్పూన్విటమిన్ E క్యాప్సిల్ – 1
ENO, నిమ్మరసంలో బ్లీచింగ్ లక్షణాలు ఉండుట వలన ముఖం ఛాయ మెరుగుదలలో బాగా సహాయపడుతుంది.
విటమిన్ E క్యాప్సిల్ లో సోలబుల్ న్యూట్రీషియన్స్, విటమిన్ ఇ సమృద్ధిగా ఉండుట వలన చర్మంలో మృత కణాలను తొలగించటమే కాకుండా చర్మ కణాలను రిపేర్ చేయటంలో కూడా సహాయపడుతుంది.
ఒక బౌల్ లో ENO పౌడర్ ,నిమ్మరసం,విటమిన్ E ఆయిల్ వేసి బాగా కలిపి ముఖానికి రాసి 5 నిమిషాల పాటు మసాజ్ చేయాలి.
ఒక అరగంట ఆలా వదిలేసి చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.ఇలా తరచుగా చేస్తూ ఉంటే ముఖం ఎప్పుడు మెరుస్తూ అందంగా కాంతివంతంగా ఉంటుంది.