టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన పూరీ జగన్నాథ్ కెరీర్ ప్రస్తుతం ఆశాజనకంగా లేదు.లైగర్ సినిమా( Liger ) పూరీ జగన్నాథ్ ను ఆర్థికంగా కూడా దెబ్బ తీసింది.
విజయ్ దేవరకొండతో పాన్ ఇండియా సినిమా తీయడమే ఒక రిస్క్ కాగా ఆ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కించడం పూరీ జగన్నాథ్ చేసిన మరో పెద్ద తప్పు అని చెప్పవచ్చు.మెగాస్టార్ చిరంజీవి పూరీ జగన్నాథ్ కు ఛాన్స్ ఇస్తారని ప్రచారం జరుగుతున్నా ఆ ప్రచారంలో నిజం లేదని తెలుస్తోంది.
చిరంజీవి( Chiranjeevi ) ఇతర డైరెక్టర్లకు ఛాన్స్ ఇస్తున్నా పూరీ జగన్నాథ్ విషయంలో ఆసక్తి చూపడం లేదు.ఇతర మెగా హీరోలతో ఇప్పటికే సినిమాలు తీసిన పూరీ జగన్నాథ్ చిరంజీవితో మాత్రం అవకాశాన్ని సొంతం చేసుకోలేకపోతున్నారు.
ప్రస్తుతం పూరీ జగన్నాథ్ ముంబైలో ఉన్నారని సమాచారం అందుతోంది.పూరీ జగన్నాథ్ ఇతర రచయితలపై ఆధారపడితే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

కొన్ని నెలల క్రితం వరకు సూపర్ యాక్టివ్ గా ఉన్న పూరీ జగన్నాథ్ కు ప్రస్తుతం ఇలాంటి పరిస్థితి రావడంపై ఫ్యాన్స్ తెగ ఫీలైపోతున్నారు.గత కొన్నేళ్లలో పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలలో టెంపర్, ఇస్మార్ట్ శంకర్( Temper ) మినహా మరే సినిమా సక్సెస్ సాధించలేదు.కొడుకుతో పూరీ జగన్నాథ్ తీసిన సినిమాలు కూడా ఫ్లాప్ కావడం గమనార్హం.మరికొన్ని నెలలు పూరీకి అజ్ఞాతవాసం తప్పదని తెలుస్తోంది.

పూరీ జగన్నాథ్ కు ఛాన్స్ ఇవ్వడానికి ఇతర నిర్మాతలు సైతం ఆసక్తి చూపించడం లేదు.పూరీ కెరీర్ పరంగా మరెన్నో విజయాలను సొంతం చేసుకోవాలని సక్సెస్ ట్రాక్ లోకి రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.ఈ ఏడాదైనా పూరీ జగన్నాథ్ కు కలిసొస్తుందో లేదో చూడాల్సి ఉంది.







