గొంతు నొప్పి.దాదాపు అందరూ ఏదో ఒక సమయంలో ఈ సమస్యను ఫేస్ చేసే ఉంటారు.
కాలుష్యం, స్మోకింగ్, జలుబు, దగ్గు, ఫ్లూ, చల్లటి పానీయాలు సేవించడం, ఇన్‌ఫెక్షన్, వాతావరణంలో మార్పులు ఇలా రకరకాల కారణాల వల్ల గొంతు నొప్పి వేధిస్తూ ఉంటుంది.చిన్న సమస్యే అయినప్పటికీ గొంతు నొప్పి అనేది నానా ఇబ్బందులకు గురి చేస్తుంది.
పైగా ఒక్కో సారి ఎన్ని మందులు వాడినా గొంతు నొప్పి తగ్గనే తగ్గదు.అయితే ఎంతటి తీవ్రమైన గొంతు నొప్పినైనా తగ్గించడంలో తానికాయ అద్భుతంగా సహాయపడుతుంది.
మరి లేటెందుకు గొంతు నొప్పికి చెక్ పెట్టాలంటే తానికాయను ఎలా వాడాలి.? అసలు తానికాయ ప్రయోజనాలు ఏంటీ.? వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.త్రిఫలములలో తానికాయ ఒకటి.
ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉండే తానికాయను ఆయుర్వేదంలో విరివిగా ఉపయోగిస్తుంటారు.ఆరోగ్య పరంగా తానికాయ బోలెడన్ని బెనిఫిట్స్‌ను అందిస్తుంది.
ముఖ్యంగా గొంతు నొప్పితో బాధ పడే వారు అర స్పూన్ తానికాయ చూర్ణంలో అర స్పూన్ తేనెను కలిపి తీసుకోవాలి.ఇలా చేస్తే ఎంతటి తీవ్రమైన గొంత నొప్పి అయినా ఇట్టే తగ్గిపోతుంది.
మరియు గొంతు మంట, గొంతు బొంగురు పోవడం, జలుబు, దగ్గు, కఫం, ఫ్లూ వంటి సమస్యలున్నా తగ్గు ముఖం పడతాయి.
అలాగే పది గ్రాముల తానికాయ చూర్ణంలో కొద్దిగా బెల్లం కలిపి తీసుకోవాలి.ఇలా ప్రతి రోజు చేస్తే కంటి చూపు పెరుగుతుంది.రక్తంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ కరిగి.
గుండె ఆరోగ్యంగా మారుతుంది.జీర్ణ వ్యవస్థ పని తీరు మెరుగు పడుతుంది.మలబద్ధకం దూరం అవుతుంది.జుట్టు రాలడం, నల్ల బడటం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.మరియు ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు సైతం తగ్గు ముఖం పడతాయి.