సూర్యాపేట జిల్లా: 78వ,భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ తెలిపారు.బుధవారం పట్టణంలోని ఇందిరమ్మ కాలనీ వద్ద గల ఫరేడ్ గ్రౌండ్లో గురువారం జరగబోయే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్లను అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావుతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వాతంత్ర్య వేడుకలకు ముఖ్యాతిథిగా రాష్ట్ర నీటిపారుదల, ఆయకట్టు అభివృద్ధి, ఆహార మరియు పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తంకుమార్ రెడ్డి హాజరై జాతీయ జెండావిష్కరణ చేసి ప్రసంగిస్తారని,వేడుకలకు వచ్చే స్వాతంత్ర్య సమరయోధులు,పుర ప్రముఖులు,
ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు,అతిథులకు, ప్రోటోకాల్ ప్రకారం తగిన ఏర్పాటు చేయాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని,త్రాగునీరు తదితర సౌకర్యాలు వివిధ శాఖల అభివృద్ధిపై ఫోటో ఎగ్జిబిషన్,విద్యార్థులచే సంస్కృతిక కార్యక్రమాలు, వివిధ శాఖలు ఏర్పాటు చేస్తున్న స్టాల్స్ కొరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వేణుమాధవరావు,తాహసిల్దార్ శ్యాంసుందర్ రెడ్డి,జెడ్పి సీఈవో అప్పారావు,డీఎస్ఓ మోహన్ బాబు,మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు, ఆర్ఐ శ్రీధర్,సంబంధిత శాఖ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.