సూర్యాపేట జిల్లా:ఆదర్శ వివాహాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని, కులాంతర,మతాంతర ఆదర్శ వివాహాలు ప్రభుత్వ రక్షణ ద్వారానే సాధ్యమవుతాయని సూర్యాపేట జిల్లా సిపిఎం కార్యవర్గ సభ్యులు కోట గోపి( Kota Gopi ) అన్నారు.గురువారంజిల్లా కేంద్రంలోని జమ్మిగడ్డ ప్రాంతానికి చెందిన షేక్ అక్బర్,షేక్ సూపియాలు గత నాలుగు సంవత్సరాలుగా ప్రేమించుకుంటూ సిపిఎం( CPM ) ఆధ్వర్యంలో జరిగిన ఆదర్శ వివాహంతో ఒకటైయ్యారు.
ఎంవిఎన్ భవనంలో జరిగిన ఈ వివాహానికి ఆయన హాజరై మాట్లాడుతూ ఇలాంటి ఆదర్శ వివాహాలను ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.ప్రభుత్వం కూడా వీటిని ప్రోత్సహిస్తూ వారికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో అవాజ్ జిల్లా కార్యదర్శి షేక్ జహంగీర్,జిల్లా సిపిఎం కార్యవర్గ సభ్యులు చిన్నపంగ నరసయ్య, అర్వపల్లి లింగయ్య,షేక్ సైదులు,షేక్ ఇమామ్,దైదా ఉపేందర్,అబ్బాయి తల్లిదండ్రులు,షేక్ కాజా తదితరులు పాల్గొన్నారు.







