సూర్యాపేట జిల్లా:ఈనెల 15 నుండి 18 వరకు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని హౌరాలో జరిగే అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ మహాసభలకు సూర్యాపేట జిల్లా నుండి ప్రతినిధులు నల్గొండ రైల్వే స్టేషన్ నుండి తరలి వెళ్లారు.ఈ సందర్భంగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపెళ్లి సైదులు మాట్లాడుతూ ఈ మహాసభలో వ్యవసాయ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం అనేక తీర్మానాలు చేయనున్నట్లు తెలిపారు.ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్ లో వ్యవసాయ కార్మికులకు తీవ్ర అన్యాయం చేసిందని అన్నారు.50 ఏళ్లు నిండిన వ్యవసాయ కార్మికులకు ఐదువేల రూపాయల పింఛన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.పేదలందరికీ ఇండ్లు,ఇళ్ల స్థలాలు,సాగు భూములు ఇవ్వాలని కోరారు.
వ్యవసాయ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం సమగ్ర కేంద్ర శాసన చట్టం చేయాలని డిమాండ్ చేశారు.
ఈనెల 18న హౌరాలో లక్షలాదిమంది వ్యవసాయ కార్మికులతో భారీ బహిరంగ సభ జరుగుతుందని,ఈ సభకు ముఖ్యాతిథిగా కేరళ ముఖ్యమంత్రి పినరై విజయన్,ఆల్ ఇండియా వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ తదితర నాయకులు హాజరవుతున్నారన్నారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు పులుసు సత్యం,జిల్లా ఉపాధ్యక్షులు బెల్లంకొండ వెంకటేశ్వర్లు,జిల్లా కమిటీ సభ్యులు లంజపెళ్లి లక్ష్మయ్య,పులసరి వెంకట ముత్యం,కెవిపిఎస్ జిల్లా నాయకులు దేవరకొండ యాదగిరి తదితరులు ఉన్నారు.