*అన్ని వ్యవస్థలను అవమాన పరుస్తున్న కేసీఆర్*
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ ఆరున్నర యేండ్ల పాటు భారత రాష్ట్రపతి వద్ద పని చేయడం జరిగిందని, దేశ బడ్జెట్ ప్రవేశపెట్టిన నప్పుడు ఉభయసభల్లో రాష్ట్రపతి వచ్చి ప్రసంగం చేస్తారని తెలిపారు.
పార్లమెంట్ లో నడిచినట్లు అన్ని రాష్ట్రాల్లో గవర్నర్ పాల్గొని ప్రసంగిస్తారని, ఉభయ సభల్లో ఏనాడు కూడా, రాష్ట్రపతి,గవర్నర్ కు రాజకీయ సంబంధాలు లేకుండా పిలివాలి,కానీ ఇక్కడ కేసీఆర్ రాజ్యాంగాన్ని అవమానపరుస్తూ గవర్నర్ ను పిలవకుండా రాజ్యాంగాన్ని అవమాన పరుస్తున్నా డని,మీడియాను కూడా కేసీఆర్ తొక్కి పడేశారని ఆరోపించారు.ప్రజాస్వామ్య వ్యవస్థల్లో ఫోర్త్ ఎస్టేట్ ను,జ్యుడీషియల్ ను, కూడా అవమాన పరిచేలా మాట్లాడి అవహేళన చేసి మాట్లాడారని అన్నారు.
కోర్టు ధిక్కరణ కేసులున్న కలెక్టర్ ను ఎమ్మెల్సీ చేశాడని, శాసనసభను కూడా అగౌరవ పరిచేలా వ్యవహరిస్తున్నాడని విమర్శించారు.ప్రతిపక్ష ఎమ్మెల్యేలను సైతం అవమానం చేస్తున్నాడని,
ఐఏఎస్,ఐపీఎస్ లను కూడా లెక్కచేయకుండా ఉంటాడని, ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసింది రాజ్యాంగాన్ని కాపాడుతానని గవర్నర్ ను, ఎమ్మెల్యేలను కించ పరుస్తున్నాడని దుయ్యబట్టారు.
మోదీపై కాంగ్రేస్ పార్టీ పోరాటం చేస్తుందని, క్యాబినెట్ ఇచ్చిన ఆమోదం పైనే గవర్నర్ ప్రసంగిస్తారని,దానికి కూడా గవర్నర్ ని పిలువలేదని గుర్తు చేశారు.