సూర్యాపేట జిల్లా:చింతలపాలెం మండలం( Chintala Palem ) కొత్తగూడెం తండా గ్రామంలో ఎక్సైజ్ అధికారులపై నాటు సారా నిందితులు రాళ్లు,బీరు సీసాలతో దాడికి తెగబడ్డారు.చింతలపాలెం ఎస్‌ఐ సైదిరెడ్డి( SI Saidireddy ) తెలిపిన వివరాల ప్రకారం… మండలంలోని కొత్తగూడెం గ్రామానికి చెందిన గుగులోతు తులశాపై గతంలో అనేక ఎక్సైజ్ కేసులతో సహా,అక్రమ మద్యం కేసు నమోదయ్యింది.
పరారీలో ఉన్న తులశాను పట్టుకునేందుకు ఎక్సైజ్ ఎస్‌ఐ దివ్య సిబ్బందితో తండాకు వెళ్లగా తులశా,అదే తండాకు చెందిన భూక్యా సత్యవతి ఎక్సైజ్ అధికారులను తీవ్ర పదజాలంతో దూషించారు.దీనితో స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోవడంతో నిందితులు రాళ్లు,బీరు సీసాలతో సిబ్బందిపై దాడి చేశారు.
ఈ దాడిలో స్థానిక సీసీ నాగరాజుతో పాటుగా ఎక్సైజ్ ఎస్‌ఐ దివ్య( Excise SI Divya )కు గాయాలయ్యాయి.రాళ్ల దాడిలో ఎక్సైజ్ అధికారుల వాహనం అద్దాలు ధ్వంసమయ్యాయి.
ఎక్సైజ్ ఎస్‌ఐ దివ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి గుగులోతు తులశా,భూక్యా సరస్వతిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్‌ఐ చెప్పారు.