సూర్యాపేట జిల్లా: జిల్లాలోని ఎఫ్.ఎస్.
టి,ఎస్.ఎస్.టి కేంద్రాలను పరిశీలించటానికి అలాగే వాస్తవ పరిస్థితిని జిల్లా ఎన్నికల అధికారికి నివేదిక అందచేయుటకు ముగ్గురు జిల్లా స్థాయి అధికారులు నియమించటం జరిగిందని, కేంద్రాల్లో ఏమైనా లోపాలను గుర్తిస్తే అక్కడే ఆ కేంద్రంలో ఉన్న బృంద ప్రతినిధికి నివృత్తికై తెలియజేయటం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావు ఒక ప్రకటనలో తెలిపారు.
అదేవిధంగా ఎఫ్.ఎస్.టి,ఎస్.ఎస్.టికి నియమించిన అధికారులు కేంద్రాలలో ఆకస్మిక తనిఖీలు చేసి నివేదికలను అదనపు కలెక్టర్,ఆర్డీవో డిఎస్పీలకు అందచేయాలని,అలాగే మూడు విడతల్లో పనిచేస్తున్న అధికారులు ఎవరైనా హాజరు కాకపోయినా,సరైన రీతిలో తనిఖీలు చేపట్టకపోయినా ఎన్నికల చట్టం ప్రకారం చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.