హుజూర్ నగర్ మండలం( Huzurnagar ) వేపలసింగారం గ్రామానికి చెందిన షేక్ నాగుల్ మీరా శుక్రవారం ఉదయం 07:30 గంటల సమయంలో పొలం దున్నటకు తన యెక్క TS 05 EC 9719 నెంబర్ గల ట్రాక్టర్ పై తన కుటుంబ సభ్యులు భార్య ఆమిన, తండ్రి హుస్సేన్ పెద్ద కుమారుడు అంజద్,చిన్న కుమారుడు తన్విర్ లను ఎక్కించుకుని వెళ్తుండగా మార్గం మధ్యలో సోము సోమిరెడ్డి పొలం వద్దకు వెళ్ళగానే సడన్ గా ట్రాక్టర్( Tractor Accident ) అదుపు తప్పి ప్రక్కనే వున్నా పొలంలోకి దూసుకెళ్లి బోల్తా పడింది.నాగుల్ మీరా పెద్ద కుమారుడు షేక్ అంజద్,(7) అక్కడిక్కడే మరణించగా,నాగుల్ మీరాకు,అతని భార్య,తండ్రికి బలమైన గాయాలు కాగా చికిత్స నిమిత్తం సూర్యాపేట ప్రభుత్వ హాస్పటల్ కుతరలించారు.
నాగుల్ మీరా సోదరుడు షేక్ ఫరీద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హుజూర్ నగర్ఎ స్ఐ తెలిపారు.