గ్రామపంచాయతీ సిబ్బంది( Gram Panchayat Staff )ని పర్మినెంట్ చేసి, వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం అనంతగిరి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గ్రామపంచాయతీ సిబ్బంది సమస్యలపై ఎంపీడీవో విజయకు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా( Telangana State ) 12,769 గ్రామ పంచాయతీలలో 50 వేల మంది సిబ్బంది పనిచేస్తున్నారని,వీరిలో పారిశుద్ధ్య కార్మికులు, స్వీపర్లు,పంపు ఆపరేటర్లు, ఎలక్ట్రిషన్లు,డ్రైవర్లు, కారోబార్,బిల్ కలెక్టర్, వివిధ కేటగిరిలో ఉన్న సిబ్బందిని,వర్కర్లను ప్రభుత్వం గుర్తించి వారిని పర్మినెంట్ చేయాలని,పని గుర్తింపు,భద్రత కార్డు, ప్రమాద బీమా లాంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.