ఇష్టం లేకున్నా.. అమల సినిమాల్లోకి ఎలా వచ్చిందో తెలుసా?

అక్కినేని అమల.టాలీవుడ్ మన్మథుడినే తన మైకంలో పడేసుకున్న బ్యూటీ.

కింగ్ నాగార్జున చేత ప్రేమ చక్కర్లు కొట్టించిన నటీమణి.

తెలుగు సినిమా పరిశ్రమలో పలు హిట్ సినిమాల్లో నటించి టాప్ హీరోయిన్ గా ఎదిగింది అమల.

హలో గురు ప్రేమకోసమే అనే పాటలో తను చూపిన అందం, అభినయానికి పడిపోని కుర్రకారు లేరని చెప్పుకోవచ్చు.ఇప్పటికీ అమలకు చాలా మంది అభిమానులున్నారు.

నాగార్జునతో పెళ్లికి ముందు వరకు ఆమె గురించి జనాలకు పెద్దగా తెలియదు.అక్కినేని కోడలు కావడంతో ఆమె గురించి తెలుసుకునేందుకు జనాలు చాలా ఆసక్తి కనబర్చారు.

Advertisement

అమల 1968 సెప్టెంబర్ 12న కోల్ కతాలో జన్మించింది.తండ్రి బెంగాల్ కు చెందిన ముఖర్జీ.

నేవీ అధికారిగా విధులు నిర్వహించాడు.తన తల్లి ఐర్లాండ్ దేశస్తురాలు.

అమల తల్లిదండ్రులది ప్రేమ వివాహం.నేవీ అధికారిగా రిటైర్ అయ్యాక ముఖర్జీ ప్రొఫెసర్ గా పనిచేశాడు.

నిజానికి అమలకు చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే పెద్దగా ఇష్టం ఉండేది కాదు.కానీ తనకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం.

షారుఖ్ ఖాన్ ఎందుకు సౌత్ డైరెక్టర్ల వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నాడు..?
పుట్టినరోజున అరుదైన ఘనతను సొంతం చేసుకున్న సింగర్ సునీత.. ఏం జరిగిందంటే?

ఆమె చదువుకునే రోజుల్లో తన డ్యాన్స్ చూశాడు దర్శకుడు టి.రాజేంద్ర ప్రసాద్.ఆమెను సినిమాల్లోకి రావాల్సిందిగా కోరాడు.అయితే ఆయన ఆహ్వానానికి అమల ఒప్పుకోలేదు.

Advertisement

ఆ తర్వాత తను మరీ మరీ కోరడంతో తన చదువు పూర్తయ్యాకే సినిమాల్లోకి వస్తానని చెప్పిందట.

అమల చదవు పూర్తి కాగానే టి రాజేందర్ దర్శకత్వంలో ఓ సినిమా ప్లాన్ రెడీ అయ్యింది.సినిమా పేరు మిథిలి ఎన్నై కాథాలి. ఈ సినిమా ద్వారా అమల వెండి తెరపైకి అడుగు పెట్టింది.

ఈ సినిమా కనీవినీ ఎరుగని రీతిలో విజయం సాధించింది.రాత్రికి రాత్రే అమల స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.

సినీ జనాలకు విపరీతంగా ఆకట్టుకుంది.తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లోనూ ఆమెకు మంచి అవకాశాలు వచ్చాయి.

మొత్తం 54 సినిమాల్లో నటించిన అమల సౌత్ లో టాప్ హీరోయిన్ గా ఎదిగింది.

తాజా వార్తలు