నల్లగొండ జిల్లా: కేసీఆర్ మాటలు నీటి మీద రాతలని,అయన తెలంగాణ ఉద్యమ కాలం నుండి ప్రజలను మోసం చేస్తూ వస్తుండని బీజేపీ నల్లగొండ జిల్లా ఇంచార్జీ ఆర్.ప్రదీప్ కుమార్ అన్నారు.
మంగళవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన నల్లగొండ నియోజకవర్గ బూత్ అధ్యక్షులు,శక్తి కేంద్ర ఇంఛార్జీలు,ఆ పైస్థాయి నాయకుల సమావేశానికి అయన ముఖ్యాతిథిగా హాజరై మాట్లాడుతూ నల్గొండ నియోజకవర్గాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత తీసుకుంటానని చెప్పిన మాటలు ఏమయాయ్యాయని ప్రశ్నించారు.
ఎన్నికల సమయంలో నలగొండ ప్రజలకు కేసీఆర్ ఇచ్చిన హామీలు ఏ ఒక్కటీ నెరవేర్చకపోవడంతో బీఆర్ఎస్ పార్టీ పట్ల వ్యతిరేకంగా వున్నారని అన్నారు.
నల్గొండ నియోజకవర్గంలో స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లతో ప్రజలలో మంచి స్పందన వచ్చిందని,నాయకులు కార్యకర్తల కృషితో నియోజకవర్గంలో బీజేపీ గ్రామాలలో బలోపేతం అవుతుందన్నారు.ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ బీజేపీ నేతలు,వివిధ స్థాయిల్లో పని ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.