పేట ఐటీ హబ్ కు రజనీకాంత్ సంగాని కృషి

సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రంలో ఐటీ హబ్ ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వం నిర్ణయించి సూర్యాపేట( Suryapet ) పాత కలెక్టరేట్ నందు గత ఎన్నికలకు ముందు లాంఛనంగా ప్రారంభించింది.కానీ,ఆ ఎన్నికల్లో ప్రభుత్వం మారడంతో నూతన ప్రభుత్వ ప్రాధమ్యాలు మారిపోవడంతో ఐటీ హబ్ విషయం తెరమరగైనట్లే అనుకున్నారు.

 Rajinikant Sangani Scontribution To Suryapet It Hub , Suryapet , Suryapet It H-TeluguStop.com

నిజానికి పేటలో ఐటి హబ్( IT Hub ) ఏర్పాటు చేయడానికి దాదాపు రెండేళ్ల కృషి జరిగింది.అందులో యుఎస్ఎ లో ఉన్న అనేక కంపెనీలను సూర్యాపేటలో పెట్టుబడులు పెట్టడానికి ఒప్పించడంతో వాటిలో దాదాపు 10 కంపెనీలు ఇక్కడకు రావడానికి హామీ ఇవ్వడంతో ఐటీ హబ్ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.

సెంటిప్రోస్ సంస్థ నిర్వాహకుడు రజనీకాంత్ సంగాని ఐటీ హబ్ కోసం తీవ్రంగా ప్రయత్నించి ఓ మేరకు విజయం సాధించారు.సూర్యాపేట సమీపంలోని బాలెంల గ్రామానికి చెందిన రజనీకాంత్ ( Rajinikanth )జన్మభూమికి తన వంతుగా ఏదైనా ఒక నిర్మాణాత్మక కార్యక్రమాన్ని చేయాలని సంకల్పించి, ఐటి హబ్ నిర్మాణానికి పూనుకొని ఏర్పాటు చేశారు.

కానీ,ప్రభుత్వం మారడంతో పూర్తిగా విస్మరణకు గురైన ఈ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించాలని రజనీకాంత్ నిర్ణయించుకున్నారు.

సూర్యాపేట మండల ప్రజా పరిషత్ మాజీ ఉపాధ్యక్షుడు రామసాని శ్రీనివాస నాయుడు ముఖ్యమంత్రి అమెరికా పర్యట గురించి అతనికి సమాచారం ఇవ్వడంతో అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( Chief Minister Revanth Reddy ),ఐటీ శాఖ మంత్రి,ముఖ్యమైన ఐఏఎస్ అధికారులను కలిసి వివరించారు.

సూర్యాపేట ఐటి హబ్ కోసం రెండేళ్ళుగా తాను కృషి చేశానని,10 కంపెనీలు రావడానికి సుముఖంగా ఉన్నాయని, ఆ రోజుల్లోనే 690 మందికి ఉపాధి అవకాశం కల్పించే అవకాశం ఏర్పడిందని, సూర్యాపేట రెండు రాజధానుల మధ్య హైదరాబాదుకు అత్యంత సమీపంలో ఉన్న పట్టణమని,పెరుగుదల కోసం,ఉపాధి అవకాశాల కోసం ఈ పట్టణం సరైనదని భావించి ఏర్పాటు చేశామని ఆయన ముఖ్యమంత్రికి వివరించారు.సత్వరమే స్పందించిన ముఖ్యమంత్రి ఐఏఎస్ అధికారి జయేష్ రంజన్ తో మాట్లాడి సమస్య పరిష్కారానికి చూడాలని ఆదేశించారని, ఆ తర్వాత ఐటి శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుతో మాట్లాడి సూర్యాపేట ప్రాధాన్యతను,అవకాశాలను వివరించారు.

దీనితో మంత్రి తప్పనిసరిగా ఐటి హబ్ ఏర్పాటు కోసం తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారన్నారు.ముఖ్యమంత్రి ఐటి శాఖ మంత్రి ఇద్దరూ సానుకూలంగా స్పందించడంతో విస్మరణకు గురైన ఐటీ హబ్ కు తిరిగి ప్రాణం పోసినట్టుగా అయ్యిందన్నారు.

సూర్యాపేట ప్రాంతానికి చెందిన ఎందరో ఐటి ప్రొఫెషనల్స్ ఈ కార్యక్రమం కోసం ఎదురుచూస్తున్నారని, వారందరికీ ఈ వార్త సహజంగానే ఆనందాన్ని నింపుతుందన్నారు.సాధ్యమైనంత త్వరలో కార్యరూపం తీసుకుంటుందని రజనీకాంత్ ఆశాభావం వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube