సూర్యాపేట జిల్లా:ఆర్టీసిలో వికలాంగులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించే విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఉన్న అడ్డంకులు ఏమిటో స్వష్టం చేయాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ డిమాండ్ చేశారు.ఈ నెల 30 లోగా ముఖ్యమంత్రి వికలాంగుల ఉచిత ప్రయాణంపై స్వష్టత ఇవ్వకుంటే 33 జిల్లాల కలెక్టరేట్లను ముట్టడిస్తామని హెచ్చరించారు.
సోమవారం చివ్వెంల మండలం గుంపుల గ్రామంలో నిర్వహించిన సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వికలాంగులకు ఇచ్చిన హామీ అయిన ఉచిత రవాణా సౌకర్యాన్ని అమలు చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు రాకపోవటం దురదృష్టకరమని అన్నారు.ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించి 30 రోజుల గడుస్తున్నా మూడు నిమిషాలకు కూడా వికలాంగుల,వికలాంగుల సంక్షేమం గురించి ఆలోచన చేయకపోవడం బాధాకరం అన్నారు.
ప్రభుత్వానికి వికలాంగుల సంక్షేమంపై చిత్తశుద్ధి ఉంటే తక్షణమే వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలని కోరారు.ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వెంటనే వికలాంగుల పెన్షన్ రూ.6000 లకు పెంచాలని,రాష్ట్రంలో వెంటనే వికలాంగుల బ్యాక్ లాగ్ ఉద్యోగాలను భర్తీ చేయాలని,స్వయం ఉపాధి రుణాల కోసం గత ప్రభుత్వ హయాంలో దరఖాస్తు చేసుకున్న వికలాంగులందరికీ షరతులు లేకుండా బ్యాంకు రుణాలను అందించాలని,ఇల్లు లేని నిరుపేద వికలాంగులు అందరికీ ప్రభుత్వమే 10 లక్షల రూపాయలతో ఇల్లు నిర్మించి ఇవ్వాలని,రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ విభాగాల్లో అవుట్సోర్సింగ్ కాంటాక్ట్ బేసిక్ లో ఉద్యోగాలు చేస్తున్న వికలాంగుల ఉద్యోగస్తులు అందరిని పర్మినెట్ చేసి, ప్రభుత్వ ఉద్యోగస్తులుగా గుర్తించడంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ శాఖల్లో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న వికలాంగుల ఉద్యోగస్తుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయటంతో పాటు వికలాంగుల ఉద్యోగస్తులకు ఆదివారం తో పాటు మరొక రోజు అదనపు సెలవు కేటాయించాలని డిమాండ్ చేశారు.సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కొల్లూరి ఈదయ్య బాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మున్న మధు యాదవ్,జిల్లా నాయకులు ఆర్ఎంపి భిక్షం,మిడతనపల్లి లింగయ్య,సంఘం మండల అధ్యక్షుడు దేవదానం,నాయకులు సంఘం గుంపుల గ్రామ శాఖ అధ్యక్షుడు మోహన చారి తదితరులు పాల్గొన్నారు