మహిళలు చైతన్యవంతులై ముందుకు సాగాలి

ఎక్కడైతే మహిళలు పూజింపబడుతారో అక్కడ దేవతలు నడయాడుతారని లయన్స్ క్లబ్ అధ్యక్షులు డాక్టర్ రమేష్ చంద్ర, ఐఎంఎ అధ్యక్షులు డాక్టర్ చంద్రశేఖర్,ప్రముఖ స్త్రీల వైద్యురాలు డాక్టర్ విజయలక్ష్మి అన్నారు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలోని రోగులకు,బంధువులకు అల్పాహారం అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేడు మహిళలు పురుషులతో సమానంగా ప్రతి రంగంలో రాణించడం అభినందనీయమనీ అన్నారు.మహిళలు మరింత చైతన్యవంతులై జీవితంలో ముందుకు సాగాలని,మహిళల కోసం ప్రభుత్వం ప్రవేశపెడుతున్న చట్టాలు,పథకాలను ప్రతీఒక మహిళ సద్వినియోగం చేసుకోవాలన్నారు.

ముఖ్యంగా 1970 వరకు ఎంటిపీ చేయడం నేరమని భావించారని,తర్వాత చట్టాలను సవరించి ప్రభుత్వ అనుమతి పొందిన రిజిస్టర్ ప్రాక్టీషనర్ వద్ద అబార్షన్ చేయించుకోవచ్చని చట్టంలో పేర్కొన్నారని తెలిపారు.ముఖ్యంగా అబార్షన్స్ చేయించుకునేవారు పరువు ప్రతిష్టల కోసం డాక్టర్ కాళ్ళవేళ్ళ పడి అబార్షన్ చేయించుకుని తర్వాత జరిగే పరిణామాలతో డాక్టర్ పై కేసులు పెట్టడం సరికాదన్నారు.

అబార్షన్ చేయాలంటే డాక్టర్ తో పాటు సిబ్బంది ఎంతో మనోవేదనకు గురవుతారని ముఖ్యంగా అబార్షన్స్ మేము వ్యతిరేకమని తెలిపారు.అబార్షన్ చేయడంతో అనేక ఇబ్బందులు వస్తాయని అన్నారు.

Advertisement

సేవ్ ద గర్ల్ సేవ్ ద చైల్డ్ నినాదంతో ఐఎంఏ ముందుకు సాగుతుందని, బ్రూణహత్యల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరుతూ మహిళలందరికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ మురళీధర్ రెడ్డి,ప్రముఖ వైద్యులు డాక్టర్ చంద్రశేఖర్,డాక్టర్ క్రాంతి, డాక్టర్ అరుణ జ్యోతి, డాక్టర్ యశ్వంత్,డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

Latest Suryapet News