ఆస్తి కోసం అన్నను చంపేందుకు తమ్ముడు స్కెచ్

సూర్యాపేట జిల్లా:ఒక మిస్సింగ్ కేసు మర్డర్ కేసుగా మారడం,మర్డర్ కేసు దర్యాప్తులో మరో మర్డర్ ప్లాన్ వెలుగు చూడడంతో జిల్లాలో సంచలన రేపింది.సూర్యాపేట రూరల్ మండలం రాజా నాయక్ తండాలో ఈ నెల 13వ తేదీన మిస్సింగైన ప్రవీణ్ 15వ,తేదీన శవమై అనుమానస్పదంగా దొరకడంతో అది హత్య అని నిర్దారించిన పోలీసులు ఎట్టకేలకు చేధించారు.

 Sketch Of Younger Brother To Kill His Elder Brother For Property-TeluguStop.com

తొలిత హతుడు ప్రవీణ్ భార్య ఇచ్చిన పిర్యాదులో లూనావత్ హరీష్ ఫై అనుమానం వ్యక్తం చేయగా,పోలీసులు మ్యాన్ మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని ఆ దిశగా విచారణ వేగవంతం చేసి నిందితులను అందరిని పట్టుకున్నట్లు ఎస్పీ విలేఖరుల సమావేశంలో తెలిపారు.

హత్యలో ప్రధాన నిందితుడు భద్రు నాయక్ సూర్యాపేట రూరల్ మండలం రాజాన తండాకు చెందిన సంపంగి విజయ రాణి తన భర్త ప్రవీణ్ (21) ఈ నెల 13 నుండి కనబడటం లేదని సూర్యాపేట రూరల్ పోలీసు స్టేషన్ లో పిర్యాదు చేసింది.

ఆ రోజు ఉదయం తన భర్తను ఇదే తండాకు చెందిన లునావత్ హరీష్@ హరితో కలిసి వెళ్ళి తిరిగి ఇంటికి రాలేదని,అప్పటి నుండి హరీష్ సైతం కనిపించుట లేదని హరీష్ మీద అమె అనుమానం వ్యక్తం చేసింది.ఫిర్యాదు అందుకున్న సూర్యాపేట రూరల్ పోలీసులు మ్యాన్ మిస్సింగ్ కేసుగా నమోదు చేసి విచారణ చేస్తుండగా మరుసటి రోజు ఈ నెల తేదీన మధ్యాహ్నం సూర్యాపేట రూరల్ మండలం తిమ్మాపురం గ్రామ శివారులోని సూర్య దేవాలయము సమీపమున గల చిన్న నీటి కుంటలో ప్రవీణ్ శవం గాయాలతో అనుమానస్పదంగా కనిపించడంతో వెంటనే మిస్సింగ్ కేసును మర్డర్ కేసుగా మార్పు చేసి సూర్యాపేట రూరల్ సిఐ ఆధ్వర్యంలో విచారణ చేపట్టి అనుమానితులైన లునావత్ హరీష్,పరుశురాములు,జక్కి సతీష్, విజయ్ భరత్,రియాజ్,యుగేందర్,రాములు అనే వారిపై నిఘా వేశారు.

హత్య కేసు నిందితుల అరెస్టు ఈనెల 22వ తేదీ ఉదయం సూర్యాపేటలోని ఈ హత్య కేసులో ఒక అనుమానితుడైన సతీష్ పెద్దమ్మ కొడుకు హరికృష్ణ జేజే నగర్ లో నివాసంలో ఉండగా లునావత్ హరీష్,పరుశురాములు,జక్కి సతీష్, విజయ్ భరత్,రియాజ్,యుగేందర్,రాములను పోలీసులు వలపన్ని పట్టుకున్నారు.అనంతరం వారిని విచారించగా పాల్వంచ మండలంలోని బసవతారక కాలనీకి చెందిన బానొత్ వీరునాయక్,భద్రు నాయక్ సొంత అన్నదమ్ములని,భద్రునాయక్ ప్రస్తుతం వికారాబాద్ జిల్లా రవాణాశాఖ అధికారిగా పనిచేస్తున్నాడని,అతని అన్న వీరునాయక్ బినామీగా భద్రు నాయక్ సైలెంట్ పార్ట్నర్ గా కలిసి గ్రానైట్, ఇతర వ్యాపారాలు చేస్తుండేవారని,ఇద్దరు కలిసి వారి స్వగ్రామంలో 120 ఎకరాల వ్యవసాయ భూమి, హైదరాబాద్ లో ఇండ్లు,ఖాళీప్లాట్లు,ఆత్మకూర్(ఎస్) మండలంలోని బొప్పారం గ్రామంలో 12 ఎకరాల భూమి,రెండు హెక్టార్ల గ్రానైట్ క్వారీ,మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురులో రెండు హెక్టార్ల గ్రానైట్ క్వారీ, చింతకాని మండలంలోని తిమ్మినేనిపాలెంలో రెండు హెక్టార్ల గ్రానైట్ క్వారీ ఖరీదు చేసి వ్యాపారం చేస్తున్న క్రమంలో వీరు నాయక్,భద్రు నాయక్ ల మధ్య స్థిర,చరాస్తి వివాదాలు పొడచూపినట్లు నిందితులు పోలీసులకు చెప్పారు.

ఆస్థిపంపకాల్లో తలెత్తిన విబేధాలతో రంగలోకి హరీష్ ఆత్మకూర్ (ఎస్) మండలం బొప్పారం గ్రామంలోని గ్రానెట్ క్వారీలో గత మూడు సంవత్సరాలుగా డిటిఓ భద్రునాయక్ బార్య తరపు బంధువు లునావత్ హరీష్ సూపర్వైజర్ గా పని చేస్తున్న క్రమంలోనే అన్న వీరునాయక్ కు,తమ్ముడు భద్రు నాయక్ కు ఆస్థి పంపకాల విషయములో గొడవలు జరుగుతున్నాయి.ఆస్థి మొత్తంలో సమాన వాటా కావాలని వీరు నాయక్ అడుగుచుండగా తమ్ముడు భద్రునాయక్ అన్నకు సమాన వాటా ఇచ్చేందుకు అంగీకరించలేదు.

సూపర్వైజర్ లునావత్ హరీష్ వల్లనే అన్నాదమ్ముల మధ్య గొడవలు అవుతున్నాయని భావించి గత సంవత్సరం హరీష్ ను వీరునాయక్ పని నుండి తీసివేశాడు.ఈ విషయం అదునుగా తీసుకున్న భద్రు నాయక్ అన్న వీరు నాయక్ ను హత్య చేస్తే ఆస్తి మొత్తం నాదే అవుతుందనే పేరాశతో హరీష్ తో హత్య పథకం రచించాడని నిందితులు విచారణలో ఒప్పుకున్నట్లు జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ వివరించారు.

అన్న హత్యకు తమ్ముడు భారీ సుఫారి ఈ క్రమంలో ఒక నిందుతుడు హరీష్ కు కోటి రూపాయలు నగదు,ఒక ఎకరము భూమి ఇస్తానని చెప్పి అన్న వీరునాయక్ ను హత్య చేయుటకు తమ్ముడైన భద్రూ నాయక్ ఒప్పుకోవడంతో,హరీష్ హత్య కోసం సుఫారి తీసుకొని ఒక ముఠాను తయారు చేసుకుని,హత్యా ప్రయత్నం విషయాలను ఎప్పటికప్పుడు వాట్సాప్ వీడియో కాల్ ద్వారా భద్రు నాయక్ కు హరీష్ తెలిపేవాడు.హత్య పథకంలో భాగంగా ఖమ్మం పట్టణం వెళ్లి వీరు నాయక్ ను హత్య చేసేందుకు గత నెల 20 రోజు రాత్రి లునావత్ హరీష్@హరి పరుశరాములు,జక్కి సతీష్,భరత్,రియాజ్,యుగేందర్,రాములు వెదికినప్పటికీ వీరు నాయక్ ఆచూకీ తెలియకపోవడంతో సూర్యాపేటకు తిరిగి వచ్చినట్లు నిందితులు ఒప్పుకున్నట్లు ఎస్పీ రాజేంద్రప్రసాద్ వివరించారు.

అన్న హత్యకు రెండుసార్లు పథకం బెడిసికొట్టడంతో ప్రవీణ్ హత్య.గత నెల 30న తిరుమలాయపాలెం మండలంలోని కాకరవాయి-జడ గ్రామాల మద్య వీరునాయక్ కారుకు వేరే కారుతో టక్కరు ఇచ్చి,కత్తులతో నరికి చంపే ప్రయత్నం చేయగా వీరునాయక్ అతని కొడుకు రమేశ్ నాయక్ లు తృటిలో తప్పించుకొని వెళ్ళినారు.

రెండు సార్లు హత్యా ప్రయత్నం విఫలం కావడంతో హతుడు ప్రవీణ్ వల్ల ఏమైనా సమాచారం లీక్ అవుతుందా అనే అనుమానంతో హతుడు ప్రవీణ్ ను నిందితుడు హరీష్ అడుగడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది.ప్రవీణ్ బ్రతికి ఉంటే వీరునాయక్ ను హత్య చేయలేమని,ఈ గొడవ కారణంగా హత్య సూఫారి విషయం బైటపెడతాడని హరీష్,భద్రునాయక్ కు చెప్పడంతో ప్రవీణ్ ను మొదలు చంపి,ఆ తరవాత తన అన్న వీరునాయక్ ను చంపాలని భద్రు నాయక్ ఆదేశించడంతో హరీష్ తో పాటు మిగతా గ్యాంగ్ ఒక ప్లాన్ ప్రకారం ఈ నెల 13న పార్టీ ఉందని దావత్ పేరుతో హతుడు ప్రవీణ్ ను నమ్మించి నెమ్మికల్ గ్రామానికి తీసుకెళ్ళి అక్కడ ప్రవీణ్ తో కలిసి అందరు మద్యం సేవించి,అదే రోజు రాత్రి జేజే నగర్ లో నివాసం ఉంటున్న నిందితుడు జక్కి సతీష్ పెద్దమ్మ కొడుకు హరికృష్ణ రూమ్ కు తీసుకొని వెళ్ళి సతీష్, హరీష్ లు కలిసి ప్రవీణ్ మెడకు బెల్ట్ బిగించగా, ప్రవీణ్ స్పృహ తప్పి క్రింద పడిపోగా అతన్ని హరీష్ కారు డిక్కీలో వేసుకొని టేకుమట్ల మీదుగా తిమ్మాపురం గ్రామ శివారులోని సూర్య దేవాలయం సమీపమునకు తీసుకెల్లి ఆపస్మారక పరిస్థితుల్లో ఉన్న ప్రవీణ్ ను కారు డిక్కీలోంచి తీసి అందరు తల ఒక్క రాయి ప్రవీణ్ తలపై వేసి చంపిన ప్రవీణ్ మృతి వీడియోలను నిందితుడు హరీష్ భద్రు నాయక్ కు పంపినట్లు వీడియో క్లిప్పింగ్ ఆధారాలు నిందితుల నుండి పోలీసులు స్వాధీనం చేసుకున్నారని ఎస్పీ వివరించారు.

ప్రవీణ్ హతం అయినట్లు వీడియోల ద్వారా నిర్దారించుకున్న భద్రు నాయక్ ఖర్చుల కోసం తన కొడుకు గూగుల్ పే ద్వారా హరీష్ కు 20 వేల రూపాయలు పంపించినట్లు పోలీసులు గుర్తించారు.అనంతరం అక్కడ ఉన్న నీటి గుంటలో ప్రవీణ్ శవాన్ని వేసి అక్కడి నుండి భద్రు నాయక్ సూచనల మేరకు పారిపోయినట్లు పోలీసుల విచారణలో నిందితులు ఒప్పుకున్నట్లు ఎస్పీ రాజేంద్రప్రసాద్ తెలిపారు.

భద్రు నాయక్ సూచన మేరకే ప్రవీణ్ హత్య వికారాబాద్ జిల్లా రవాణా శాఖ ముఖ్య అధికారి భద్రు నాయక్ సూచన మేరకే ప్రవీణ్ ను హత్య చేసినామని నిందితులు అంగీకరించగా,హైదారాబాద్ లో నివాసం ఉన్న భద్రు నాయక్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని విచారించగా ఇప్పటి వరకు తన అన్న వీరు నాయక్,ప్రవీణ్ హత్య కోసం ఒక కోటి రూపాయలు,ఒక ఎకరం భూమి ఈ హత్యల సూఫారి గ్యాంగ్ వారికి ఇస్తానని చెప్పిన మాట వాస్తమేనని, ఈ హత్య కోసం నా భార్య తరపు బంధువైన హరీష్ కు తన కొడుకు,తన డ్రైవర్ గూగుల్ పే,ఫోన్ పే ఏకౌంట్ల నుండి స్వయంగా సుమారు 10 లక్షల రూపాయలు నగదుగా ఇచ్చినట్లు జిల్లా రవాణా శాఖ అధికారి భద్రు నాయక్ తన నేరం అంగీకరించినట్లు ఎస్పీ తెలిపారు.

అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా ఆ అధికారి డబ్బుపై వ్యామోహం,నిత్యం వివాదాలు,అంతులేని అవినీతి బానోత్ భద్రు నాయక్ నైజంగా ఆయన గురించి తెలిసిన వారు చెబుతున్న మాట.సూర్యాపేట జిల్లా రాజా నాయక్ తండాలో జరిగిన ప్రవీణ్ హత్యకు ప్రధాన నిందితుడు వికారాబాద్ జిల్లా రవాణా అధికారిగా పని చేస్తున్న భద్రు నాయక్, వికారాబాద్ జిల్లాలో సైతం అవినీతి అధికారిగా ముద్ర వేసుకున్నారు.ఎంతోమంది వాహనదారుల వద్ద అక్రమంగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు సైతం పెద్ద ఎత్తున ఎదుర్కొంటున్న ఆరోపణలు ఉన్నాయి.

ఆయన వాహనదారుల,డ్రైవింగ్ లైసెన్స్ లు,ఫిటినెస్ చెకింగ్ లు,జరిమానాల పేరుతో ప్రజల వద్ద అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వద్ద సైతం పెద్ద నివేదికలే ఉన్నట్లు తెలిసింది.గతంలో మహబూబాబాద్ జిల్లాలో పనిచేసిన ఈయనను తీవ్రమైన ఆరోపణల మధ్య బదిలీచేసినప్పటికి ఆయన తీరు మారలేదని పలువురు అంటున్నారు.

హత్య కేసులో నిందితుల వివరాలు హైదరాబాద్ సరూర్ నగర్ కొత్తపేట లక్ష్మినగర్ కాలానికి చెందిన వికారాబాద్ జిల్లా జిల్లా రవాణా శాఖ అధికారి బానొత్ భద్రునాయక్,సూర్యాపేట మండలం రాజానాయక్ తండాకు చెందిన లునావత్ హరీష్ @ హరి,సూర్యాపేట పట్టణం చంద్రన్నకుంటకు చెందిన గంట పరుశరాములు,షేక్ పఠాన్ రియాజ్, జేజే నగర్ కు చెందిన జక్కి సతీష్,హైదారాబాద్ రామాంతపూర్ కేసీఆర్ నగర్ కు చెందిన వీర్ల విజయ్ భరత్,సూర్యాపేట మండలం రాజా నాయక్ తండాకు చెందిన లునావత్ యుగేందర్,లునావత్ రాములును అరెస్ట్ చేసి 9 సెల్ ఫోన్ లు,ఒక కారు,ఆరు కత్తులు స్వాధీనం చేసుకొని సూర్యాపేట మేజిస్ట్రేట్ ముందు హాజరు పర్చగా రిమాండ్ కు తరలించిన్నట్లు సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్ లో జరిగిన మీడియా సమావేశంలో నందు కేసు వివరాలను జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ వివరించారు.కేసు అనతికాలంలోనే చేధించిన డీస్పీ నాగభూషణం,సీఐ విఠల్ రెడ్డి,ఎస్ఐలు సాయిరాం,విష్ణు,పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.

అవినీతి శాఖ అధికారులు విచారణ ఉండదా? తెలంగాణా రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో పనిచేసిన జిల్లా రోడ్ ట్రాన్స్ పోర్టు అధికారి బానోత్ భద్రు నాయక్ ఫై పత్రిక పరంగా,ప్రజల విజ్ఞప్తిలుగా,అవినీతి నిరోధక శాఖ అధికారుల వద్ద పలు నివేదికలు ఉన్నప్పటికీ ఇప్పటి వరకు ఆయా శాఖ అధికారులు దాడులు చేయకపోవడం విడ్డూరం.అవినీతికి పరాకాష్ట అయిన ప్రస్తుత హత్య నిందితుడు భద్రు నాయక్ ఆస్తులపై ఇప్పటికైనా మెరుపు దాడులు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube