ఉగాది వేడుకల్లో వైయస్సార్ టిపి అధినేత్రి షర్మిల

సూర్యాపేట జిల్లా:నూతనకల్ మండల కేంద్రంలో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి దూరపు బంధువు,నూతనకల్ సర్పంచి తీగల కరుణశ్రీ ఇంటిలో జరిగిన ఉగాది వేడుకల్లో తెలంగాణ వైయస్సార్ టిపి అదినేత్రి వైయస్ షర్మిల పాల్గొని,రాష్ట్ర ప్రజలందరికీ శుభకృతి నామ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ సంవత్సరం రైతులు పండించిన పంట మద్దతు ధర కంటే ఎక్కువ ధరకు అమ్ముడుపోవాలని,రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు ఆగాలని,నిరుద్యోగ సమస్య తీరి,వారికీ ఒకదారి దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు.

 Yssr Tp Chief Sharmila At Ugadi Celebrations-TeluguStop.com

ఉద్యోగ నియామకాలు 30వేలు 80వేలు కాకుండా ఖాళీగా ఉన్న లక్షా 90 వేల ఉద్యోగాలు భర్తీ కావాలని,నూతనంగా ఏర్పడినటువంటి మండలాల్లో ఉన్న సిబ్బంది కొరత తీరాలని కోరారు.రాష్ట్రంలో మహిళలకు గౌరవం లేదని,చివరికి రక్షణ లేకుండా పోయిందని వాపోయారు.

మహిళలు ఆర్థికంగా బలపడాలని,కార్పొరేషన్లు,ఉపాధి అవకాశాలు మెరుగు పడాలని ఆశాభావం వ్యక్తంచేశారు.ఈ కార్యక్రమంలో వైఎస్సార్ టిపి తుంగతుర్తి నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించిన ప్రజా గాయకుడు ఏపూరి సోమన్న,సర్పంచ్ కుటుంబ సభ్యులు,వైఎస్సార్ టిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube