పురుగుల అన్నం తిని అస్వస్థతకు గురైన విద్యార్థులు...!

సూర్యాపేట జిల్లా: అనంతగిరి మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్నం పురుగుల అన్నం తిని 10 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.బియ్యంలో పురుగులు వేరు చేయకుండా అలాగే వండి పెట్టడంతోనే ఈ సంఘటన జరిగిందని విద్యార్థులు చెబుతున్నారు.

 Students Who Got Sick After Eating Wormy Rice, Students Got Sick ,eating Wormy R-TeluguStop.com

పాఠశాల వద్దకు చేరుకున్న స్థానికులు,పేరెంట్స్ మాట్లడుతూ మధ్యాహ్న భోజనం వండే బియ్యం కడగకుండా,పురుగులను వేరు చేయకుండా అలాగే వండడంతో విద్యార్థులకు వాంతులు అయ్యాయని, కూరగాయలు కూడా శుభ్రం చేయకుండా, పురుగులు పడిన వాటిని పారేయకుండా విద్యార్థులకు వండి పెడుతున్నరని,అయినా ఉపాధ్యాయులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పాటశాల ప్రధానోపాధ్యాయుడు విధులకు హజరు కాకుండా హాజరైనట్లు రిజిస్టర్లో నమోదు సంతకం చేస్తున్నారని,పాఠశాల ఉపాధ్యాయులు కూడా సమయపాలన పాటించకుండా ఇష్టానుసారంగా విధులు నిర్వహిస్తున్నారని, ఉపాధ్యాయుల పర్యవేక్షణ లోపం వల్లనే ఈ ఘటన జరిగిందని ఆరోపించారు.

పిల్లలు తినే భోజనం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై,అలాగే విధులకు సక్రమంగా హజరు కాకుండా పర్యవేక్షణ చేయకుండా ఉంటున్న ఉపాధ్యాయులపై శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube