సంత్ సేవాలాల్ భోధనలు మానవాళికి ఆచరణీయం:మంత్రి జగదీష్ రెడీ

సూర్యాపేట జిల్లా: గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ భోధనలు ప్రపంచ మానవాళికి ఆచరణీయమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు.జిల్లా కేంద్రంలోని బంజారా భవన్ లో గురువారం జరిగిన సేవాలాల్ 284 వ జయంతి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన భోగ్ బండార్ వేడుకల్లో ఆయన ముఖ్యాతిధిగా పాల్గొని మాట్లాడుతూ సేవాలాల్ భోధనలను ప్రతిఒక్కరూ ఆచరించాలన్నారు.

 Sant Sewalal's Teachings Are Practical For Humanity: Minister Jagdish Ready , Mi-TeluguStop.com

మానవ నాగరికత పరిణామక్రమంలో అనేక మార్పులు చెందుతూ వస్తుందని,కాలంతో పాటు భాష,వస్త్రధారణ, అలవాట్లు మారుతున్నాయన్నారు.సమాజంలో ప్రజలు సన్మార్గంలో పయనించడానికి కట్టుబాట్లు,ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు నెలకొల్పారని అన్నారు.

ఆంగ్ల భాష వ్యామోహంలో రేపటి తరానికి మాతృ భాషను దూరం చేయవద్దన్నారు.భాషను మరవిపోవడం అంటే కన్నతల్లిని,సంస్కృతిని మరచిపోవడమేనని అన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో అన్ని ఆచార, సంప్రదాయాలకు సముచిత స్థానం లభిస్తుందని,సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాలు అధికారికంగా నిర్వహించడం జరిగిందని అన్నారు.తెలంగాణ రాష్ట్రంలోని లంబాడి తండాలను గ్రామ పంచాయతీలుగా గుర్తించిన ఘనత సిఎం కెసిఆర్ దే అన్నారు.

లంబాడి తండాలు ఘర్షణ లేని వాతావరణంలో జీవించాలని,సంత్ సేవాలాల్ భోధనలు పాటించాలన్నారు.కోరికలే అనర్థాలకు మూలం కాబట్టి చెడు ఆలోచనలు, కోరికలను మంటలలో దహింపచేయడమే భోగ్ బండార్ అని అన్నారు.

ఆర్డీవో రాజేంద్రకుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో గిరిజన సహకార సంస్ధ చైర్మన్ రాంచందర్ నాయక్, మున్సిపల్ చైర్మన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, చివ్వెంల జెడ్పిటిసి సంజీవ్ నాయక్,ఎంపీపీ ధరావత్ కుమారి బాబు నాయక్, ఎంపీటీసీ సభ్యురాలు లూనావత్ శాంతాబాయి పండు నాయక్,రిటైర్డ్ డిటిడిఓ లూనావత్ పాండు నాయక్,భిక్షం నాయక్,బాబు నాయక్, ఉద్యోగ సంఘం నాయకులు మోతిలాల్ నాయక్,భద్రు నాయక్, ధారసింగ్ నాయక్,పాండు నాయక్,వెంకన్న నాయక్, బాలు నాయక్,రాజేష్ నాయక్,కౌన్సిలర్ లు పలువురు లంబాడీ గిరిజన ప్రముఖులు, రాజకీయ,ఉద్యోగ,విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube