బిగ్ బ్రేకింగ్-కోదాడలో గ్యాంగ్ రేప్

సూర్యాపేట జిల్లా:దేశంలో మహిళలపై,ఆడపిల్లలపై జరుగుతున్న అకృత్యాలను,అత్యాచారాలను అరికట్టేందుకు,ప్రభుత్వాలు నిర్భయ లాంటి ఎన్ని కఠినమైన చట్టాలు తెచ్చినా నిర్భయంగా మహిళలపై,ఆడపిల్లలపై మృగాళ్ల వేట కొనసాగుతూనే ఉంది.ఇద్దరు మృగాల క్రూరత్వానికి ఓ లేడిపిల్ల మూడు రోజుల పాటు విలవిల్లాడిన హృదయ విధారక సంఘటన సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో వెలుగుచూడడం పట్టణంలో తీవ్ర కలకలం రేపింది.

 Gang Rape On The Big Breaking-ax-TeluguStop.com

ఇద్దరు యువకులు ఓ యువతిపై సాగించిన దుర్మార్గపు క్రీడకు కోదాడ పట్టణం మూగ సాక్ష్యంగా నిలిచింది.వివరాల్లోకి వెళితే కోదాడ పట్టణానికి చెందిన ఇద్దరు యువకులు ఓ యువతికి కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి మూడు రోజులుగా ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని తెలిసి పట్టణ ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

ఆ మృగాల పైచాచికత్వం నుండి తప్పించుకున్న యువతి జరిగిన దారుణాన్ని బంధువులకు తెలపడంతో వారు పట్టణ పోలీసులను ఆశ్రయించారు.బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చేరిన యువతికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది.

నిందితుల్లో ఒకరు అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్ కుమారుడిగా సమాచారం.ఈ ఘటనపై మహిళా సంఘాలు భగ్గుమన్నాయి.

నిందితులను కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube