సూర్యాపేట జిల్లా:ఓటు అవశ్యకతపై డ్రాయింగ్, పెయింటింగ్ ద్వారా యువతకు చైతన్యం కల్పించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ అన్నారు.
రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును స్వేచ్ఛగా, నిర్భయంగా అందరూ వినియోగించుకోవాలని సూచించారు.మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉదయం 10:30 గంటల నుండి 12:30 గంటల వరకు ఎన్నికల్లో మద్యం,డబ్బు దుర్వినియోగం లేదా ప్రతి ఒక్కరు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి అనే అంశంపై మూడు కేటగిరీల నందు పోటీలు నిర్వహించగా 108 మంది విద్యార్థులు పాల్గొన్నారన్నారు.తొమ్మిది,పదవ తరగతి ఒకటవ కేటగిరి,ఇంటర్, డిగ్రీ రెండవ కేటగిరి,అలాగే ఇతరులు మూడవ కేటగిరి గా విభజించి మూడు క్యాటగిరిల్లో ఒక్కొక్క కేటగిరిలో ప్రథమ, ద్వితీయ,తృతీయ, కన్సోలేషన్ బహుమతికి ఎంపికైన వారికి రూ.2000,రూ.1000, రూ.500,రూ.300 చొప్పున బహుమతులు ఇవ్వనున్నట్లు తెలిపారు.జిల్లా విద్యాశాఖ అధికారి,స్వీప్ నోడల్ అధికారి అశోక్,డిఐఈఓ కృష్ణయ్య,కార్యక్రమ ఇన్చార్జి క్వాలిటీ కోఆర్డినేటర్ జనార్ధన్, బాల భవన్ పర్యవేక్షకులు రాధారెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్బంగా పోటీకి హాజరైన వారిని ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ ఎన్నికల నందు ఓటరు టర్న్ అవుట్ 100% ఉండాలని,ఎలాంటి ప్రలోభాలకు లోనవ్వకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని, తాము చైతన్యంగా ఉంటూ తల్లిదండ్రులను ఇతరులను ప్రభావితం చేయాలని ఆకాంక్షిస్తూ విద్యార్థులకు శుభాకాంక్షలు, శుభాశీస్సులు అందజేశారు.న్యాయ నిర్ణేతలుగా శిరంశెట్టి ఆనంద్,పల్లె మణిబాబు, రాజు,ఎల్లయ్య,జయకృష్ణ వ్యవహరించారు.
విజేతల ఎంపిక ప్రక్రియ పూర్తి తదుపరి విద్యార్థులకు ఫోన్ ద్వారా విషయం తెలియజేసి చేసి ఎప్పుడు హాజరవ్వాలి,ఎక్కడ హాజరు అవ్వాలి అనే విషయాలు తెలియపరచడం జరుగుతుందని తెలిపారు.