దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేసిన సమయంలో ప్రజల ప్రాణాలని కాపాడేందుకు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి త్యాగం చేసింది పారిశుద్ధ్య కార్మికులనిభారతీయ జనతా పార్టీ సూర్యాపేట జిల్లా అధికార ప్రతినిధి,అడ్వకేట్ బాలాజీ నాయక్ అన్నారు.బుధవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని హుజూర్ నగర్ పట్టణంలో అలుపెరుగకుండా శ్రమిస్తూ కరోనా సమయంలో కూడా తమ ప్రాణాన్ని లెక్కచేయకుండా, నిరంతరం శుభ్రత పాటిస్తూ స్వచ్ఛతకు మారుపేరైన మున్సిపల్ కార్మికులకు అయన ఘనంగా సన్మానించి,పండ్లు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ అధ్యక్షులు షేక్ ఉద్దండు,టిడిపి టౌన్ కన్వీనర్ కొమ్మగాని వెంకటేశ్వర్లు,మహిళ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.